Jacqueline Fernandez : నా దేశం పరిస్థితి అంటూ.. శ్రీలంక సంక్షోభంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరోయిన్

తాజాగా శ్రీలంకలో ఏర్పడిన ఈ సంక్షోభం గురించి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ట్వీట్ చేసింది. జాక్వెలిన్ శ్రీలంకకు చెందిన యువతి. మొదట్లో శ్రీలంకలో నటించినా ఇక్కడ......

Jacqueline Fernandez : నా దేశం పరిస్థితి అంటూ.. శ్రీలంక సంక్షోభంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరోయిన్

Jacqueline

Jacqueline Fernandez : ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధన కొరతతో పోరాడుతోంది. శ్రీలంకలో ప్రజలు ఆహరం దొరక్క, ఉన్నా రేట్లు ఆకాశంలో ఉండటంతో విలవిల్లాడుతున్నారు. దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంతో కొట్టుకుంటున్నారు. దీని వల్ల పలు చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది రాజకీయ నాయకులు తమ పదవులకి రాజీనామా కూడా చేశారు. ప్రజలు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని కూడా చుట్టూ ముట్టారు. ప్రపంచం మొత్తం శ్రీలంక పరిస్థితికి జాలి చూపిస్తుంది. భారత్ తో సహా కొన్ని దేశాలు లంకకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి.

తాజాగా శ్రీలంకలో ఏర్పడిన ఈ సంక్షోభం గురించి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ట్వీట్ చేసింది. జాక్వెలిన్ శ్రీలంకకు చెందిన యువతి. మొదట్లో శ్రీలంకలో నటించినా ఇక్కడ బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది. తాజాగా శ్రీలంక పరిస్థితి చూసి బాధపడుతూ వరుస ట్వీట్స్ ని చేసింది జాక్వెలిన్.

Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

 

ఈ ట్వీట్స్ లో.. ”ఒక శ్రీలంక యువతిగా, నా దేశం మరియు దేశప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రపంచమంతా దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. దయచేసి దేనిని తొందరపడి జడ్జ్ చేయకండి. ఇలాంటివి వారికి అవసరం లేదు.వారికి సానుభూతి మరియు మద్దతు అవసరం. వారి బలం మరియు శ్రేయస్సు కోసం 2 నిమిషాలు నిశ్శబ్దంగా ప్రార్థిద్దాం. ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది. నా దేశానికి మరియు దేశప్రజలకు ఏర్పడిన ఈ సంక్షోభం శాంతియుతంగా, ప్రజల ప్రయోజనం కోసం ఈ పరిస్థితి త్వరలో ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇందుకోసం కష్టపడే వాళ్లకి బలం చేకూరాలని, సపోర్ట్ ఉండాలని ప్రార్థిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసింది. చివర్లో మనం ఐక్యంగా నిలబడకుండా విడిపోతే దేశం నాశనం అవుతుంది అంటూ శ్రీలంక భాషలో రాసింది.