Surya : మరో అరుదైన ఘనత సాధించిన ‘జై భీమ్’.. ఆస్కార్ ఛానల్లో ‘జై భీమ్’ ప్రస్తావన

తాజాగా 'జైభీమ్‌' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో 'సీన్‌ ఎట్‌ ది అకాడమీ' పేరుతో....

Surya : మరో అరుదైన ఘనత సాధించిన ‘జై భీమ్’.. ఆస్కార్ ఛానల్లో ‘జై భీమ్’ ప్రస్తావన

Jai Bheem

Jai Bheem : కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు డిఫరెంట్ రోల్స్‌లో కూడా జనాల్ని అలరిస్తున్నాడు సూర్య. ఇటీవల వరుసగా ఓటీటీలలో సినిమాలు రిలీజ్ చేసి విజయాలు సాధిస్తున్నాడు సూర్య. గతంలో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా కూడా మంచి విజయం సాధించి అనేక అవార్డుని గెల్చుకుంది. ఆ సినిమా కూడా ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. తాజాగా మొన్న దీపావళికి సూర్య నటించిన చిత్రం ‘జైభీమ్‌’ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా అభినందనలు పొందుతుంది.

‘జస్టిస్‌ చంద్రు’ అనే లాయర్ జీవిత కథతో పాటు అతను డీల్ చేసిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులని సాధించింది. ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ సినిమాలని దాటి 9.6 రేటింగ్‌ కూడా సాధించింది. అలాగే గోల్డెన్‌ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినే​ట్‌ అయింది జై భీమ్ సినిమా. తాజాగా ‘జైభీమ్‌’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘సీన్‌ ఎట్‌ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని సీన్స్ గురించి చెప్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Jyothi Reddy : జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

ఆస్కార్ యూట్యూబ్ వేదికగా మన సినిమా గురించి అందులోని సీన్స్ గురించి మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేయడం గర్వకారణం. ఈ ఛానల్ లో ‘జైభీమ్‌’ సినిమా గురించి ప్రస్తావించడంతో చిత్ర యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ దీంతో అరుదైన ఘనత సాధించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.