NTR30: తారక్ సినిమాలో జాన్వీ రెమ్యునరేషన్ అంతా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కి్స్తుండగా, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లుగా తారక్ ఇటీవల వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోబోతున్నట్లుగా వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

NTR30: తారక్ సినిమాలో జాన్వీ రెమ్యునరేషన్ అంతా..?

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కి్స్తుండగా, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లుగా తారక్ ఇటీవల వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోబోతున్నట్లుగా వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

#NTR30 : తారకరత్న మృతితో.. వాయిదా పడ్డ NTR 30 పూజా కార్యక్రమం..

ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఓకే చేసిందని.. ఇక ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ ఏకంగా రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అమ్మడి కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్‌గా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో అమ్మడి పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NTR30: ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని.. తారక్‌ను ఇలాంటి పాత్రలో మునుపెన్నడూ చూసి ఉండరని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.