Shah Rukh Khan : నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా అన్నందుకు.. షారుఖ్ ఇంటికి ఫుడ్ డెలివరీస్!

షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ఒక అభిమానితో.. 'నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా' అని ఒక ట్వీట్ చేసినందుకు ఏకంగా ఇంటికి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని..

Shah Rukh Khan : నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా అన్నందుకు.. షారుఖ్ ఇంటికి ఫుడ్ డెలివరీస్!

Jawan star Shah Rukh Khan tweet on Swiggy delivery gone viral

Shah Rukh Khan : బాలీవుడ్ (Bollywood) కింగ్ ఖాన్ షారుఖ్ పఠాన్ (Pathaan) ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని తాను కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని కొంతమేర ఆదుకున్నాడు. ఇక పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా #AskSRK అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన షారుఖ్.. అభిమానులు నుంచి ఎంతో ప్రేమని అందుకున్నాడు. దీంతో ఆ కార్యక్రమాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు.

Shah Rukh Khan : బాలీవుడ్‌ ఇతర హీరోల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నవి అవే అంటున్న షారుఖ్.. ట్వీట్ వైరల్!

ఈ ఇంటరాక్షన్ లో ఒక అభిమాని.. ‘భోజనం చేశావా భాయ్?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి షారుఖ్ బదులిస్తూ.. ఎందుకు భాయ్.. “నువ్వేమైనా స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతావా?” అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇక ట్వీట్ చూసిన స్విగ్గీ (Swiggy) సంస్థ షారుఖ్ ఇంటికి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసింది. ముంబైలోని షారుఖ్ ఇంటి వద్ద ఫుడ్ పార్సిల్స్ తో నిలబడ్డ డెలివరీ బాయ్స్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మీ కోసం మేము డిన్నర్ తీసుకు వచ్చాం’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Prabhas : ప్రభాస్, మారుతి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్!

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డంకీ (Dunki), జవాన్ (Jawan) సినిమాల్లో నటిస్తున్నాడు. జవాన్ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని షారుఖ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.