Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?

బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో భారీగా మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 11 వారాలు షో పూర్తి చేసుకొని 12వ వారంలో అడుగుపెట్టింది.

Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?

Bigg Boss 5 (1)

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో భారీగా మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 11 వారాలు షో పూర్తి చేసుకొని 12వ వారంలో అడుగుపెట్టింది. గత వారం అనీ మాస్టర్ ఎలిమినేషన్ తో మొత్తం 11 మంది ఇంటి నుండి బయటకి వచ్చేయగా ఇప్పుడు ఇంట్లో జస్ట్ ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో దాదాదాపుగా ఒకరిద్దరు మినహా అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కాగా ఎవరు టైటిల్ కొడతారన్నది కూడా ఆసక్తిగా మారింది.

NTR30: ఎన్టీఆర్, కొరటాల సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?

కాగా, ఈ షోలో నడిచేది ప్రేక్షకులు చూసేది మొత్తం పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందని ఎలిమినేషన్ నుండి విన్నర్స్ వరకు షో నిర్వాహకులు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటారని సోషల్ మీడియాలో కొందరు ఈ షోను వ్యతిరేకించే వారి వాదన. ఈ షోలో కంటెస్టెంట్ల ఎమోషన్ కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తారని ప్రచారం జరుగుతుంటుంది. కాగా.. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ కూడా ఇటు ప్రేక్షకుల ఓట్లతో పాటు షో నిర్వాహకుల ప్లాన్ ప్రకారమే జరిగిందని టాక్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా జెస్సీ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు.

Ajay Devgn : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

జెస్సీ ఎలిమినేషన్ వెనుక చాలా ప్లానింగ్ ఉందంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ ముందుగా సీక్రెట్ రూంలో ఉంచడం ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడలేదని హౌస్ నుండి బయటకు పంపారు. అయితే, తీరా బయటికి వచ్చాక జెస్సీ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. విందులు, వినోదాలలో జెస్సీ భేషుగ్గా పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చెప్పినట్లు, అంత సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్ అతనిలో ఎక్కడా కనిపించడం లేదు. మరి షో నుండి ఎందుకు బయటకి పంపారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. అసలు విషయం కంటెస్టెంట్లకు తెలిసినా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కడా అది బయటపెట్టే పరిస్థితి ఉండదన్నది నెటిజన్ల వాదన. మరి నిజమేదో అబద్దమేదో ఆ బిగ్ బాస్ కే తెలియాలి.