Jio Fiber : కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. మీరు ఓ లుక్కేయండి!

జియో ఫైబర్ కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. 3 నెలల కాలపరిమితికి గాను అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ తో పాటు ఓటిటి సబ్స్ క్రిప్షన్ కూడా ఇవ్వనుంది.

Jio Fiber : కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. మీరు ఓ లుక్కేయండి!

Jio Fiber

Jio Fiber : టెలికామ్ రంగంలో జియో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికామ్ రంగంలో జియోకి ముందు జియో తర్వాత అనేలా మార్పులు వచ్చాయి. ఇక ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను జియో మరింత విస్తరించింది. ఇంతకాలం బ్రాడ్‌బ్యాండ్‌ లో 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్ అందించింది జియో.. ప్రస్తుతం మూడు నెలల వ్యవధితో కూడిన పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లు తీసుకునే కస్టమర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించనక్కర్లేదని జియో తెలిపింది.

జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ రూ.2,097 వద్ద ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు..

* రూ.2,097 ప్లాన్‌ – 100 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌కాల్స్‌.

* రూ.2,997 ప్లాన్‌ – 150 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా,ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.4,497 ప్లాన్‌ – 300 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.7,497 ప్లాన్‌ – ఈ ప్లాన్ కి వచ్చే సరికి నెట్ వేగం పెరిగింది. అత్యధికంగా 500 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.11,997 ప్లాన్‌ ఈ ప్లాన్ కి వచ్చే సరికి నెట్ వేగం మరింత పెరిగింది. 1 జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.25,497 ప్లాన్‌ జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్స్ లో ఇదే చివరిది. ఈ ప్లాన్ లో నెట్ వేగం పెరిగింది. 1 జీబీపీఎస్‌ వేగంతో నెలకు 6,600 జీబీ డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు – ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5. ఈ ప్లాన్ తీసుకున్న వారికి మూడు నెలలకు సుమారు 20 వేల జీబీ డేటా లభిస్తుంది.