RRR: ఏళ్లకు ఏళ్ళు షూటింగ్.. జక్కన్నను ఓ ఆట ఆడేసుకున్న సుమ-తారక్

మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి...

RRR: ఏళ్లకు ఏళ్ళు షూటింగ్.. జక్కన్నను ఓ ఆట ఆడేసుకున్న సుమ-తారక్

Rrr (1)

RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చూసుకొనే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాకి మరింత పగడ్బంధీగా ప్రమోషన్ ఏర్పాటు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయారు.

RRR: గయ్యాళి అత్త సుమ.. నోరు లేని భర్త రాజీవ్.. తారక్ ఫన్నీ కామెంట్స్!

ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ యాంకర్ సుమతో రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ పై ఫన్నీ చిట్ చాట్ జరిగింది. అందులో ముందుగా రామ్ చరణ్ ప్రభాస్ తో.. మరో రెండేళ్లు నేను తారక్ బిజీ అంటూ చెప్తుంటే.. పాపం వీళ్ళు రెండేళ్లే అనుకుంటున్నారు.. అనే మీమ్ చూపించగా.. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఖచ్చితంగా 2020లోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పిన కామెంట్స్ కు రవితేజ-బ్రహ్మానందం నేనింతే వీడియో ఎడిట్ చేసిన మీమ్ వీడియో చూపించింది సుమ.

RRR: బాహుబలిని మించే సత్తా RRRకు నిజంగా ఉందా..?

దానిపై పగలబడి నవ్వుకున్న నలుగురు.. అసలు అప్పుడే జక్కన్నకు 2021, 2022 అవదు అని ఎలా తెలుసు అని తారక్ ప్రశ్నించగా.. దానికి సుమ ప్రీవియస్ ఎక్స్ పీరియన్స్ అంటూ ఆన్సర్ చెప్పింది. ఆయన గురించి ఆయనకు బాగా తెలుసు.. రెండు మూడేళ్లు పట్టొచ్చని తారక్ చెప్పడంతో రాజమౌళి తెగ ఫీలైపోయాడు. అయినా ఆపని సుమ-తారక్ ఆరు నెలలలో తీయాల్సిన ఈగ సినిమాను రెండేళ్లు చేశాడని.. 6 నెలలలో తీయాల్సిన మర్యాద రామన్నను 18 నెలలు తీశాడని.. లక్కీగా ఈగ కాబట్టి రెండేళ్లు అయిందని అదే బొద్దింక అయితే ఇంకెన్నేళ్ళు పట్టేదో అంటూ రాజమౌళిని ఆ అట ఆడేసుకున్నారు.