NTR : ఎట్టకేలకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్న జూనియర్..

ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తాను కూడా భాగం కాబోతున్నాడు.

NTR : ఎట్టకేలకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్న జూనియర్..

Junior NTR Kalyan Ram attending 100 Years of NTR function at Hyderabad

NTR at 100 Years of NTR : ఈ ఏడాది నందమూరి తారక రామారావు శత జయంతి జరుగుతుండడంతో.. ఆ సందర్భాన్ని ఘనంగా చేసేలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), హీరో బాలకృష్ణ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జయంతిని ఏడాది నుంచి ఒక ఉత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి పూర్తి కానుంది. ఇక గత నెల 28న అంకురార్పణ సభని విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు.

NTR 100 Years : ఎన్టీఆర్ మహానటి సావిత్రిని ఏమని పిలిచేవారో తెలుసా?

ఆ సభకి ముఖ్య అతిధిగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తీసుకు వచ్చారు. ఇక ఆ వేదిక పై నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ కనిపించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఎక్కడ కనిపించలేదు. ఇక ఈ శత జయంతి ఉత్సవాలు గురించి కూడా వీరిద్దరూ ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కూడా కనిపించలేదు. అయితే 28న జరిగే ఈవెంట్ కి జూనియర్ వస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఎన్టీఆర్ కి తెలంగాణ మినిస్టర్ నుంచి 28న వరంగల్ లో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందడం, జూనియర్ కూడా వస్తానంటూ మాట ఇవ్వడంతో పూర్తిగా శత జయంతి వేడుకకి దూరం కాబోతున్నాడని అందరూ అనుకున్నారు.

NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?

అయితే తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 20న కూకట్‌పల్లిలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతుల కూడా హాజరు కానున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకి ఈ వేడుకల్లో భాగం అవుతుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.