Warangal : భద్రకాళి ఆలయానికి జస్టిస్ ఎన్వీ రమణ

ఆదివారం ఉదయం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన...

Bhadrakali Temple : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. శనివారం సాయంత్రం రామప్ప ఆలయాన్ని ఆయన సందర్శించారు. సీజేఐ రమణకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి హనుమకొండలోని ఎన్‌ఐటీ అతిథిగృహంలో బస చేశారు జస్టిస్‌ ఎన్వీ రమణ. 2021, డిసెంబర్ 19వ తేదీ ఆదివారం ఉదయం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయానికి ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం ఒంటి గంటకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు సీజేఐ రమణ.

Read More : Petrol Price India : వాహనదారులకు గుడ్ న్యూస్, పెట్రోల్ ధరల్లో నో ఛేంజ్..వివరాలు

నూతన భవన సముదాయం నిర్మాణంతో జిల్లా కోర్టులో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 90 యేళ్ల కిందట నిజాంకాలంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటివరకు కోర్టులు నడుస్తూ వచ్చాయి. పెరిగిన అవరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త భవన సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 23కోట్ల 50లక్షల రూపాయలలో 21కోట్ల 65 లక్షలతో సువిశాలమైన భవన సముదాయాన్ని నిర్మించారు. కోటి వ్యయంతో పార్కింగ్‌, అంతర్గత సీసీ రోడ్లు, లాన్‌ను ఏర్పాటు చేశారు. మరో 65లక్షల రూపాయలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. లక్షా 23వేల 980 చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు