కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సంగీత దర్శకుడు.. ఆయనను విమర్శించే హక్కు మీకు లేదు: ఎమ్మెల్యే నాగరాజు

MLA Nagaraju: మరి ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు.

Congress MLA Nagaraju

తెలంగాణ రాష్ట్ర గీతం వివాదంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ రాజు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అందెశ్రీని విమర్శించడానికి సిగ్గుండాలని అన్నారు.

కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సంగీత దర్శకుడని, ఆయనను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌కు లేదని చెప్పారు. ప్రవీణ్ కుమార్ అప్పట్లో ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోదామని అన్నారని, మరి ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ఆయన ఇప్పుడు ఏనుగును విడిచి కారెక్కారని విమర్శించారు.

స్వెరోస్ అనే సంస్థను పెట్టి దొంగలను పోషించారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మోస పూరిత మాటలను దళితులు నమ్మొద్దని చెప్పారు. దళితులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారని అన్నారు. కాగా, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఈ సమయంలో కీరవాణి ఇష్యూపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

Also Read: దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు