తెలంగాణ గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదే .. విద్యుత్ కోతలపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియాగాంధీకి ఆహ్వానం పంపిన రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ ను కలిసి ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు. అనంతరం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23లో సీఎం అధికారిక నివాసం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై నెలకొన్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చారు.

Also Read : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక.. జిల్లాల వారీగా తుది పోలింగ్ వివరాలు ఇవే..

రాష్ట్ర గీతం రూపకల్పనపై ..
తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు. తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చాం. అందె శ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేయాలనేది నా పనికాదు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదే. తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ..
కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకెళ్తామని రేవంత్ చెప్పారు. కాళేశ్వరం సమస్య 32పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చే సమస్య కాదు. విరిగింది వెన్నుముక. నీటిని స్టోర్ చేసి విడుదల చేసే పరిస్థితి లేదు. కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రంలో వదిలిన నీళ్లలాంటివి. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంట్ బిల్లులు కట్టామని రేవంత్ అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై ..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల కోడ్ నేపథ్యంలో నేను సమీక్ష జరపలేదు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపడం లేదు. అటువంటి వెధవ పనులు నేను చేయను. కనపడకుండా పోయిన హార్డ్ డిస్క్ లు, ధ్వంసం అయిన డేటా, బాక్ అప్ డేటా ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాలని సీఎం రేవంత్ అన్నారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చు.

తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ఏ వ్యవస్థను దురుపయోగ పర్చలేదు. తెలంగాణలో కరెంట్ కోతలు లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల, ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోవడం వల్ల పవర్ సప్లై లో అంతరాయం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


 

 

ట్రెండింగ్ వార్తలు