వామ్మో.. తృటిలో తప్పిన గండం.. మండీ బిర్యానీ తిని ఆసుపత్రిపాలైన కుటుంబం

హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.

Mandi Biryani : పెళ్లి రోజున సంతోషంగా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లారు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా బిర్యానీ తిన్నారు. కానీ ఇంటికి వచ్చి రాగానే ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, రక్త విరేచనాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా శాద్ నగర్ లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో నరేందర్ అనే వ్యక్తి పెళ్లి రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి మండీ బిర్యానీ తిన్నారు. వాంతులు, విరేచనాలై పరిస్థితి విషమించింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు ఐసీయూలో చేర్చి ప్రాణాలు కాపాడారు.

హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. కల్తీ ఫుడ్ తో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి. ఒకవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ.. కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్లిన ఆహారాన్నే వేడి వేడిగా వండి వడ్డిస్తున్నారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడిన రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు నరేందర్ డిమాండ్ చేశారు.

Also Read : కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు.. హోటల్స్‌లో బయటపడుతున్న దారుణాలు

ట్రెండింగ్ వార్తలు