తెలంగాణ వ్యాప్తంగా రవాణ శాఖ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి..

రవాణ శాఖ ఆఫీసులపై దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఏసీబీ ఇటువంటి దాడులు చేస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా రవాణ శాఖ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. పలు జిల్లాల్లోని ఆయా ఆఫీసులపై ఆకస్మికంగా అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

రవాణ శాఖ ఆఫీసులపై దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఏసీబీ ఇటువంటి దాడులు చేస్తోంది. రంగారెడ్డి మణికొండ ఆఫీసులో 25 మంది అధికారులతో సోదాలు జరుగుతున్నాయి. డీఎస్పీ శ్రీధర్ సమక్షంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, హైదరాబాద్ లోని మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.

అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మహబూబ్‌నగర్ జిల్లాలోని రవాణా శాఖ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫైల్స్‌తో పాటు డబ్బులు కూడా గుర్తించింది ఏసీబీ.
ఏకకాలంలో రవాణా శాఖపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తుండడంతో అక్రమాలకు పాల్పడే ఉద్యోగుల్లో భయం నెలకొంది. రికార్డులను పరిశీలించి అందులోని లోపాలను ఏసీబీ అధికారులు గుర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడు చేశారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు