ప్రజా భవన్ మరికొద్ది సేపట్లో పేలిపోతుందంటూ బాంబు బెదిరింపు కాల్.. పోలీసులు తనిఖీలు చేయగా..

ప్రజాభవన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ ...

Praja Bhavan in Hyderabad : ప్రజాభవన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రజా భవన్ లో బాంబు స్వ్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, అతను బాగా మద్యం సేవించి ఉన్నాడని తెలుస్తోంది. అయితే, పోలీసులు ఫేక్ కాల్ చేసిన వ్యక్తి గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Also Read : తెలంగాణ గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదే .. విద్యుత్ కోతలపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు