Rythu Bharosa Scheme : రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. కానీ, ఈసారి వాళ్లకే.. ఖాతాల్లో జమయ్యేది ఎప్పుడంటే?
Rythu Bharosa Scheme : వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి ప్రారంభం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ, రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తోంది.
Rythu Bharosa Scheme
- తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్
- రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం
- రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి
Rythu Bharosa Scheme : పంటల సాగులో రైతులకు ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్, యాసంగి సీజన్లలో రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.12వేలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పథకం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.
Also Read : తెలంగాణలో ‘వాలంటీర్లు’.. మీరు అనుకుంటున్నట్టు కాదు..
వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి మొదటి వారం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ, రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తోంది. దీంతో రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయాఅని రైతులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిధుల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈనెల 16వ తేదీతో ఎలక్షన్ కోడ్ ముగియనుంది. ఈనెల 17వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈసారి రైతు భరోసా పథకం నిధులను అందరికీ ఒకేసారి జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో మొదటగా ఒక ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమచేసిన ప్రభుత్వం.. విడతల వారిగా రెండు, మూడు ఎకరాలు.. ఆ తరువాత ఐదెకరాలలోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తూ వచ్చింది. అయితే, ఈ సారి విడతల వారిగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆ రోజు నిధులు విడదల కాకపోయినా.. 18, 19 తేదీల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి రెండు నెలలుగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మరో రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమకానుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
