ఛీ..ఛీ.. స్కానింగ్ సెంటర్‌లో ఆపరేటర్ వికృత చేష్టలు.. మహిళల ఫొటోలు, వీడియోలు తీసి..

స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతుల ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధిత మహిళలను బెదిరిస్తున్నాడు.

Scanning Center Incident : నిజామాబాద్ లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో అకృత్యాలపై అధికారులు స్పందించారు. స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ను అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్.. స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు, యువతుల ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధిత మహిళలను బెదిరిస్తున్నాడు.

స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి సీరియస్ అయ్యారు. ఘటనపై వివరణ ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన అత్యంత దారుణంగా వ్యవహరించిన ఆపరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కూతురి ప్రేమ వ్యవహారమే తండ్రి ప్రాణం తీసిందా..? బిల్డర్‌ మధు హత్య కేసులో సంచలన విషయాలు

 

ట్రెండింగ్ వార్తలు