Kajal Agarwal : కొడుకుతో ఫోటో షేర్ చేసిన కాజల్.. ఎంత ముద్దుగా ఉన్నాడో..

తాజాగా కాజల్ తన బాబుతో ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో కూడా పూర్తిగా ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది. తన బాబుని ఎత్తుకొని బెడ్ మీద............

Kajal Agarwal : కొడుకుతో ఫోటో షేర్ చేసిన కాజల్.. ఎంత ముద్దుగా ఉన్నాడో..

Kajal

Kajal Agarwal :  హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత కరోనా టైంలో ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చి తల్లయింది. అప్పట్నుంచి మాతృత్వపు మధురిమలు అనుభవిస్తుంది. పుట్టినప్పుడు ఒకటి రెండు ఫోటోలు బాబు ముఖం కనపడకుండా పోస్ట్ చేసింది. కాజల్ ఎప్పుడు తన కొడుకుని చూపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Malavika Menon : ఓ యాడ్ కోసం ధగధగ మెరిసిపోతున్న మాళవిక మీనన్

తాజాగా కాజల్ తన బాబుతో ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో కూడా పూర్తిగా ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది. తన బాబుని ఎత్తుకొని బెడ్ మీద కాజల్ పడుకొని ఉన్న ఫోటోని షేర్ చేసింది. బాబుని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. కొడుకు పేరు నీల్ కిచ్లు అని పెట్టిన సంగతి తెలిసిందే. ఇక కాజల్ ప్రస్తుతానికి సినిమాలకి దూరంగానే ఉంటూ తల్లి పోస్ట్ ని ఆస్వాదిస్తోంది. ఈ ఫోటోనో షేర్ చేసి నా జీవితానికి ప్రేమ ఇతనే. నా హార్ట్ బీట్ కూడా ఇతనే అని తన కొడుకు గురించి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.