Kajal Agarwal : ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టిన కాజల్

ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు కాజల్ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు. తాజాగా తను ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని తన........

Kajal Agarwal : ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టిన కాజల్

Kajal

Kajal Agarwal :  సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలని ఆచి తూచి చేస్తుంది. కొన్ని రోజుల క్రితం నుంచి సినిమాలని ఆపేసింది. కాజల్ కి ప్రెగ్నెన్సీ రావడంతో ఉన్న సినిమాల నుంచి కూడా తప్పుకుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు కాజల్ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు.

Ashish : సుకుమార్ నిర్మాణంలో ‘రౌడీ బాయ్స్’ హీరో రెండో సినిమా

ఇక అప్పటి నుంచి కాజల్ దిగి పోస్ట్ చేసే ఫోటోలలో తన బేబీ బంప్ కనపడుతుంది. ఇటీవల తన బేబీ బంప్ తో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేసింది కాజల్. తాజాగా తను ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆన్లైన్ లో ఫిజిక్ 57 ఇండియా అనే సంస్థ సాయంతో ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ ని చేస్తుంది. ఆన్లైన్ లో ప్రెగ్నెంట్ ఎక్సర్‌సైజ్ నేర్చుకుంటున్న వీడియోని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్. ఫిజిక్ 57 ఇండియా సంస్థతో నేను నా ప్రినటల్ జర్నీని ప్రారంభించాను అంటూ పోస్ట్ చేసింది.