Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్

సమంత, పూజా హెగ్డేలను దాటేసిన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్

Kajal Aggarwal

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ, కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల మీద ఫోకస్ తగ్గించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పక్కన నటిస్తున్న ‘ఆచార్య’ మాత్రమే కాజల్ ఖాతాలో ఉన్న ఒకే ఒక్క సినిమా. ఫిబ్రవరి 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. కింగ్ నాగార్జున సరసన నటిస్తున్న ‘ఘోస్ట్’ నుండి కాజల్ తప్పుకుంది లేదా తప్పించారు అనేది పక్కన పెడితే అమ్మడు ఆ సినిమా చెయ్యట్లేదు.

Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?

కొద్ది రోజులుగా గుడ్ న్యూస్ చెప్తానంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది కాజల్ కిచ్లు. తను ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమాలు కమిట్ అవట్లేదని, ఆ విషయాన్ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యబోతుందని అన్నారు కానీ కాజల్ మాత్రం కామ్‌గా ఉంది. ఫుల్ టైం ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ అడపా దడపా ఇన్‌స్టాలో సందడి చేస్తోంది.

Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా ఓ రేర్ ఫీట్ సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ ఫాలోవర్ల సంఖ్య అక్షరాలా 20 మిలియన్ల మార్క్ టచ్ చేసింది. స్టార్ హీరోయిన్ సమంత, హాట్ బ్యూటీ పూజా హెగ్డేలను దాటి కాజల్ ఈ ఫీట్ సాధించడం విశేషం. సమంతను 19.4 మిలియన్స్, పూజాను 15.6 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా కాజల్ వారిని దాటేసింది. అలాగే ట్విట్టర్‌లో 5 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు కాజల్ కిచ్లుకి.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)