Bimbisara: కళ్యాణ్ రామ్ ఊహించని ట్రాన్స్‌ఫర్మేషన్.. కలిసొచ్చేనా?

కళ్యాణ్ రామ్ సినిమాలంటే.. రొటీన్ కమర్షియల్ సినిమాలే అనే టాక్ ఇక మర్చిపోవాల్సిందే. కళ్యాణ్ రామ్ సినిమాలంటే.. రొటీన్ గా నాలుగు పైట్లు, 6 పాటలు అనే కాన్సెప్ట్ ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే.

Bimbisara: కళ్యాణ్ రామ్ ఊహించని ట్రాన్స్‌ఫర్మేషన్.. కలిసొచ్చేనా?

Bimbisara

Bimbisara: కళ్యాణ్ రామ్ సినిమాలంటే.. రొటీన్ కమర్షియల్ సినిమాలే అనే టాక్ ఇక మర్చిపోవాల్సిందే. కళ్యాణ్ రామ్ సినిమాలంటే.. రొటీన్ గా నాలుగు పైట్లు, 6 పాటలు అనే కాన్సెప్ట్ ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. నందమూరి ఫ్యాన్స్ కనీసం కల కూడా కనని క్యారెక్టర్ లో కనిపించారు కళ్యాణ్ రామ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బింబిసార టీజర్ చూస్తే అసలు ఈ ట్రాన్స్ ఫమేషన్, ఈ రేంజ్ ప్రజెంటేషన్ కళ్యాణ్ రామ్ దేనా అని ఇంకా షాక్ లోనే ఉన్నారు ఫ్యాన్స్.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

నందమూరి ఫ్యామిలీలో యంగ్ జనరేషన్ లో ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్ క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్నారు. హీరోగా, ప్రొడ్యూసర్ గా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యని కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ తన స్టైల్ మార్చుకుని సో కాల్డ్ బోరింగ్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఎక్స్ పెరిమెట్స్ చెయ్యడానికి రెడీ అయ్యారు. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ బింబిసారగా ఇంతకుముందెప్పుడూ కనిపించని సరికొత్త లుక్ తో, పవర్ఫుల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

Bigg Boss 5: ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. ఎలిమినేట్ అయ్యేది?

కళ్యాణ్ రామ్ కి సక్సెస్ లు పెద్దగా లేకపోయినా సినిమాల స్పీడ్ మాత్రం ఉంది. అందుకే రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి డిఫరెంట్ మూవీస్ వైపు కన్నేశారు ఈ నందమూరి నాయకుడు. టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టూ గుడ్ ట్యాగ్ తో లేటెస్ట్ గా రిలీజ్ అయిన బింబిసారలో రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించారు కళ్యాణ్ రామ్. ఇప్పటి వరకూ హిస్టారికల్ క్యారెక్టర్ల జోలికెళ్లని కళ్యాణ్ రామ్.. ఫస్ట్ టైమ్ బింబిసారగా తిగర్తల రాజ్యాధిపతిగా రూత్ లెస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు.

Muddy: దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్.. బొమ్మ పక్కా హిట్టా?

బింబిసారలో సరికొత్తగా అటు నెగెటివ్ షేడ్స్ తో పాటు, కాంటెపరరీ హీరోగా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నారు కళ్యాణ్ రామ్. కెరీర్ లో చాలా పవర్ ఫుల్ రోల్స్ చేసిన కళ్యాణ్ రామ్.. బింబిసారలో అంతకుమించి తన యాక్టింగ్ టాలెంట్ ని చూపించబోతున్నారు. వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ టైమ్ ట్రావెల్ మూవీలో కంటెంట్ ఉంటే కంగారుపడాల్సింది లేదంటూ కాన్ఫిడెన్స్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ గా ఆడియన్స్ ముందుకుతెస్తున్నారు కళ్యాణ్ రామ్.