Kamal Haasan : ఇండియన్ 2 తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టిన లోక నాయకుడు.. ఏ డైరెక్టర్స్ తో సినిమాలు ఓకే చేశాడో తెలుసా?

ఇప్పటికే ఇండియన్ 2 సినిమా తర్వాత కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ తో విక్రమ్ 2 సినిమా చేస్తాడని ఫిక్స్ అయి ఉంది. అయితే ఈ మధ్యలో మరో రెండు సినిమాలు చేరాయి. వరుసగా మూడు సినిమాలను............................

Kamal Haasan : ఇండియన్ 2 తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టిన లోక నాయకుడు.. ఏ డైరెక్టర్స్ తో సినిమాలు ఓకే చేశాడో తెలుసా?

Kamal Haasan said OK for three films at once

Kamal Haasan :  కమల్ హాసన్(Kamal Haasan) గత సంవత్సరం విక్రమ్(Vikram) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా ఇచ్చిన భారీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చి మళ్ళీ ఆగిపోయిన సినిమా షూటింగ్స్ కూడా మొదలుపెట్టి వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆగిన ఇండియన్ 2(Indian 2) సినిమా(Cinema) షూటింగ్ మొదలుపెట్టి శరవేగంగా చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాజల్, రకుల్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో ఇండియన్ 2 సినిమాని భారీగా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తైవాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇప్పటికే ఇండియన్ 2 సినిమా తర్వాత కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ తో విక్రమ్ 2 సినిమా చేస్తాడని ఫిక్స్ అయి ఉంది. అయితే ఈ మధ్యలో మరో రెండు సినిమాలు చేరాయి. వరుసగా మూడు సినిమాలను ఓకే చేశాడు లోకనాయకుడు. తమిళ్ స్టార్ హీరో అజయ్ తో వలిమై, తునివు లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమాని ఓకే చేశారు. అనంతరం మణిరత్నం దర్శకత్వంలో కూడా ఓ సినిమాని ఓకే చేశారు కమల్. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో నాయకన్ అనే సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనడంతో అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Syed Abdul Rahim : ఎవరీ సయ్యద్ అబ్దుల్ రహీం.. ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర మార్చిన హైదరాబాద్ వ్యక్తిపై అజయ్ దేవగణ్ బయోపిక్ ‘మైదాన్’

ఈ రెండు సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ విక్రమ్ 2 సినిమా ఉంటుందని సమాచారం. ఒకవేళ విక్రమ్ 2 కంటే ముందే ఖైదీ 2 వస్తే అందులో కమల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇలా మూడు సినిమాలు ఓకే చేసి, ఓ సినిమా సెట్స్ మీద పెట్టి మొత్తం నాలుగు సినిమాలని చేతిలో ఉంచుకున్నారు కమల్ హాసన్. విక్రమ్ ఇచ్చిన సక్సెస్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చి ఇలా వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలతో సక్సెస్ ని కంటిన్యూ చేస్తారేమో చూడాలి.