Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

కంగనా మాట్లాడుతూ.. ''అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు. కానీ ఇతర సినిమాలని...................

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

Kangana

Kangana Ranaut :  బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్‌ ఇటీవల నటించిన సినిమా ‘ధాకడ్‌’. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. బాలీవుడ్ లోని కొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులపై కంగనా సమయం కుదిరినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోలని విమర్శించింది.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కంగనా మాట్లాడుతూ.. ”అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు. కానీ ఇతర సినిమాలని ప్రమోట్ చేస్తారు. అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెప్పాడు. కానీ దాని గురించి ఒక ట్వీట్ కానీ, ఆ సినిమాని ప్రమోట్ చేయడం కానీ చేయలేదు. అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల నా సాంగ్ టీజర్ ను ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించారు. దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. అజయ్ దేవగణ్‌ వేరే హీరోయిన్స్ చేసే మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు కానీ నా సినిమాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని వారికి తెలుసు. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్‌ చేసిన అర్జున్‌ రాంపాల్‌కి నేను కృతజ్ఞత చూపిస్తాను. అలాగే నా సినిమాలో అజయ్‌ దేవగణ్‌ నటించినా అలాగే కృతజ్ఞతతో ఉంటాను” అని తెలిపింది.

Suddala Ashok Teja : నా కొడుకే నాకు మళ్ళీ జన్మనిచ్చాడు..

 

”నేను వేరే వాళ్ళ సినిమాలని సపోర్ట్ చేసినట్టే నా సినిమాలు కూడా వేరే వాళ్ళు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్‌ ఫైల్స్‌, షేర్షా వంటి సినిమాలని బహిరంగంగానే అభినందించాను. గతంలో సినిమాలు బాగుంటే నేను సిద్ధార్థ మల్హోత్రా, కరణ్‌ జోహార్‌ సినిమాలని కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చెప్తాను. ఎవరికీ తెలియకుండా కాల్‌ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి ఆ స్టార్ హీరోలు కూడా నాలాగే భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని ఆశిస్తున్నాను” అని మాట్లాడింది కంగనా.