Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా కంగనా.. ఓటీటీ టెలికాస్ట్

ఇటీవల అన్ని పరిశ్రమలలోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్‌గా కూడా మారుతున్నారు. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్......

Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా కంగనా.. ఓటీటీ టెలికాస్ట్

Kangana (1)

Kangana Ranaut :   బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. దేశం గురించి, మహిళల గురించి, తన గురించి అయినా ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ అవుతుంది. ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఒకపక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపైన తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నో సార్లు ఎంతోమంది పై భయపడకుండా కామెంట్స్ చేసి ఎప్పుడూ వివాదాల్లో కూడా నిలుస్తుంది. అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోతుంది కంగనా.

ఇటీవల అన్ని పరిశ్రమలలోనూ చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్‌గా కూడా మారుతున్నారు. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా కొత్త షో చేయబోతుంది. ఇటీవల బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షో వివరాలు వెల్లడించినా నిన్న సాయంత్రం ఈ షో లాంచింగ్ కార్యక్రమంలో కంగనా దీనికి హోస్ట్ చేయనుందని తెలిపారు.

Adavi Shesh : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో

ముంబైలో గురువారం సాయంత్రం కంగనారనౌత్‌ యాంకర్ గా పరిచయం కానున్న రియాల్టీ షో ‘లాక్‌ అప్‌’ని లాంచ్ చేశారు. మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌ ఈ రియాల్టీ షోని నిర్మిస్తుంది. త్వరలో ఈ షో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ షో కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ‘లాక్ అప్’ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించి, ఈ షోని లాంచ్ చేశారు.

View this post on Instagram

A post shared by Erk❤️rek (@ektarkapoor)