Karthi : నార్త్ వాళ్లకు పొన్నియిన్ సెల్వన్ అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం.. కార్తీ కామెంట్స్..

ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. అయితే పార్ట్ 1కి చేసిన రేంజ్ లో ప్రమోషన్స్ పార్ట్ 2 కు చెయ్యట్లేదు.

Karthi : నార్త్ వాళ్లకు పొన్నియిన్ సెల్వన్ అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం.. కార్తీ కామెంట్స్..

Karthi comments on Ponniyin Selvan Movie

Karthi :  తమిళ్(Tamil) నుంచి గత సంవత్సరం మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రిలీజయింది. ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. అయితే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అంతగా విజయం సాధించలేదు.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 రాబోతుంది. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. అయితే పార్ట్ 1కి చేసిన రేంజ్ లో ప్రమోషన్స్ పార్ట్ 2 కు చెయ్యట్లేదు. పార్ట్ 1 కేవలం తమిళ్ లో హిట్, మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రమే ఆడటంతో ఇప్పుడు పార్ట్ 2 ప్రమోషన్స్ కూడా ఎక్కువగా తమిళ్ లోనే చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఏదో నామమాత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ మరో 10 రోజులు ఉంది. ఈ గ్యాప్ లో వేరే రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ 2కి మరిన్ని ప్రమోషన్స్ చేస్తారేమో చూడాలి.

Asha Parekh : అమితాబ్ కి మంచి పాత్రలు రాస్తున్నారు.. సీనియర్ నటీమణులకు ఎందుకు రాయరు.. ఆశా పరేఖ్ ఫైర్..

తాజగా చెన్నైలో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో కార్తీ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ప్రతినిధి నార్త్ లో పొన్నియిన్ సెల్వన్ 1 అంతగా ఆడలేదు కదా, పార్ట్ 2 ఆడుతుందని అనుకుంటున్నారా అని అడగడంతో కార్తీ సమాధానమిస్తూ.. మీరు అన్నది నిజమే పొన్నియిన్ సెల్వన్ సినిమా నార్త్ వాళ్ళు అర్ధం చేసుకోవటం కొంచెం కష్టమైంది. నాకు కూడా మొదట్లో అలానే అనిపించింది. నేను నవల చదువుతున్నప్పుడు పది పేజీల వరకు రాగానే పాత్రల పేర్లు అన్నీ మర్చిపోయాను. ఇంకా వాళ్ళకి కూడా అలా అనిపించడంలో తప్పు లేదు. కానీ ఓటీటీ రిలీజ్ అయ్యాక పొన్నియిన్ సెల్వన్ ని ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. అందువల్ల పార్ట్ 2ని వారు కచ్చితంగా ఆదరిస్తారు అని తెలిపారు.