SonuSood Chappal Discount : సోనూసూద్ పేరు చెబితే చెప్పులకు డిస్కౌంట్

చెప్పులు కొనాలనుకుంటున్నావరు. ఇదిగో ఈ షాపుకు రండీ.. నా పేరు చెప్పండీ..చెప్పులకు డిస్కౌంట్ పొందండీ అంటున్నాడు ప్రముఖ నటుడు..మానవత్వానికి మారుపేరుగా నిలుస్తూ కష్టంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్న సోనూ సూద్.

SonuSood Chappal Discount : సోనూసూద్ పేరు చెబితే చెప్పులకు డిస్కౌంట్

Sonusood Chappal Discount

sonu sod named buys chepllas discount : సినిమా షూటింగ్‌ కోసం జమ్మూ-కశ్మీర్‌ వెళ్లిన ప్రముఖ నటుడు..కరోనా సమయంలో వలస కార్మికుల పాలిటే కాదు కష్టంలో ఉన్నపాలిట దేవుడగా మారిన సోనూసూద్ కశ్మీర్ మార్కెట్లో తిరుగుతూ సందడి చేశారు. ఈక్రమంలో ఓ చెప్పులు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లిన సోనూ బేరం ఆడి మరీ చెప్పులు కొన్నారు. అదేంటీ పేదవాళ్లకు సహాయం అడకపోయినా కష్టాన్ని తెలుసుకుని మరీ ఆపన్నహస్తం అందించే సోనూసూదు వీధి వ్యాపారి వద్ద బేరాలు ఆడటం ఏంటీ అనుకోవచ్చు. అదే మరి సోనూ స్టైల్.

షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి వద్దకు వెళ్లి చెప్పులు కొనటానికి అతని దుకాణంలోంచి ఓ జ‌త చెప్పులు తీసుకుని ‘వీటి ధ‌ర ఎంత? అని అడిగారు. అతను ధర చెప్పాడు.దానికి సోనూ..‘ఏంటీ వీటికి డిస్కౌంట్ ఇవ్వవా? అని అడిగారు. దానికి అత‌ను 20 శాతం డిస్కౌంట్ ఇస్తాను సార్ అని చెప్పాడు. సోనూ చెప్పులు కొన్నటం పూర్తి అయ్యింది.ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్‌ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్‌ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేశారు సోనూసూద్‌. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలే సోనూసూద్ పేరు ఉంటే చాలు అది వైరల్ అవ్వక ఏమవుతుంది? అలా ఈ వీడియో కూడా వైలర్ గా మారింది. చిన్న వ్యాపారుల‌కి స‌పోర్ట్‌గా సోనూసూద్ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సోనూసూద్ ..మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో కీలక పాత్ర‌ను పోషించిన విష‌యం తెలిసిందే. మ్యూజిక్ వీడియోతో సినీ ల‌వ‌ర్స్ ను ప‌లుక‌రించేందుకు రెడీ అయ్యాడు. పాట‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌గా, సోష‌ల్ మీడియా ద్వారా మ్యూజిక్ వీడియో ఫ‌స్ట్ అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. సాంగ్ టీజ‌ర్ ఆగ‌స్టు 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

సోనూసూద్‌. కరోనా సమయంలో వలస కార్మికుల పాలిటే కాదు కష్టంలో ఉన్నపాలిట దేవుడగా మారారు. అదీ ఇదీ అనకుండా ఏ సహాయం అయినా చేయటానికైనా వెనుకాడే వ్యక్తి కాదు. సోనూసూద్ అంటే మంచితనం..మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు ఆయన చేసిన దాతృత్వంలో. రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు.