Katrina Kaif: వద్దనుకొంటే తెంచుకునేది కాదు.. డైవర్స్‌పై క్యాట్ ఎమోషనల్!

బాలీవుడ్ లో సెక్సీ విత్ హార్టెడ్ బ్యూటీ ఎవరంటే ముందుగా మనకి గుర్తొచ్చే పేరు కత్రినా కైఫ్. అందమైన రూపమే కాదు అంతకు మించిన మంచి మనసు కూడా క్యాట్ సొంతమని చాలాసార్లు గుర్తు చేసింది.

Katrina Kaif: వద్దనుకొంటే తెంచుకునేది కాదు.. డైవర్స్‌పై క్యాట్ ఎమోషనల్!

Katrina Kaif

Katrina Kaif: బాలీవుడ్ లో సెక్సీ విత్ హార్టెడ్ బ్యూటీ ఎవరంటే ముందుగా మనకి గుర్తొచ్చే పేరు కత్రినా కైఫ్. అందమైన రూపమే కాదు అంతకు మించిన మంచి మనసు కూడా క్యాట్ సొంతమని చాలాసార్లు గుర్తు చేసింది. సాధారణంగా బీటౌన్ హీరోయిన్స్ అంటే లవ్, మ్యారేజ్, డైవర్స్ అంశాలను చాలా సింపుల్ గా తీసుకుంటారనే ఓ టాక్ ఉంటుంది. కానీ.. అందులో కూడా ఇలాంటి విషయాలలో సెన్సెటివ్ గా ఉండే హీరోయిన్స్ ఉన్నారని గతంలో దీపికా పదుకొనె లవ్ ఫెయిల్యూర్ సమయంలో రుజువైన సంగతి తెలిసిందే.

Bigg Boss 5: బిగ్ బాస్ తర్వాత ఇంట్లో వినిపించే గొంతు కాజల్‌దే

కాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ క్యాట్ త్వరలోనే తాను వలచిన ప్రియుడు విక్కీ కౌశల్ ను మనువాడనుంది. అయితే.. ఇంకా పెళ్లి కాకముందే పెళ్లి, విడాకులు, సంసారం జీవితం అంశాలపై క్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధం మనం అనుకుంటే ఏర్పడేది కాదు, వద్దనుకొంటే తెంచుకునేది కూడా కాదన్న కత్రినా.. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటాను.. ఆలూమగలు విడిపోతే ఆ ప్రభావం కుటుంబంపై, ముఖ్యంగా పిల్లలపై ఎంత ఉంటుందో నాకు అనుభవమని చెప్పింది.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

మా అమ్మానాన్నలకు మేం ఎనిమిది మంది సంతానం. నా చిన్నతనంలో అమ్మా నాన్న విడిపోయారు. అమ్మే అంతమందినీ పెంచి పోషించి ఏ లోటూ రాకుండా చూసుకుంది. కానీ, ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రేమ ద‌క్కకపోయినా ఆ బాల్యం అసంపూర్ణంగా ఉంటుందన్న క్యాట్ నా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చింది. కాగా.. మరో రెండు రోజులలోనే రాజస్థాన్‌ లోని 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్న క్యాట్-విక్కీ జంట ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకోనున్నారు.