Vikky – Katrina : నన్ను పెళ్ళికి పిలవలేదు.. విక్కీ-కత్రీనా మ్యారేజ్ పై కియారా

నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి కియారా అతిధిగా వెళ్లగా అక్కడి మీడియా విక్కీ కౌశల్, కత్రినా వివాహం గురించి అడిగారు. దీనికి కియారా సమాధానమిస్తూ.. 'నిజంగానా? వాళ్ళ పెళ్లి....

Vikky – Katrina : నన్ను పెళ్ళికి పిలవలేదు.. విక్కీ-కత్రీనా మ్యారేజ్ పై కియారా

Kiara

Vikky – Katrina :  ప్రస్తుతం బాలీవుడ్‌ లో బాగా వినపడుతున్న పేర్లు విక్కీకౌశల్, కత్రీనాకైఫ్. వీళ్ళ పెళ్లి గురించే బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. వీరిద్దరూ డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోబోతునట్లు పుకార్లు వస్తున్నాయి. వీటిపై ఇప్పటిదాకా విక్కీ కాని కత్రినా కానీ స్పందించలేదు. కానీ రోజూ పెళ్లి గురించి అప్ డేట్స్ మాత్రం ఏదో ఒకటి వినిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలీదు. తాజాగా వీరి వివాహంపై హీరోయిన్ కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.

Chatrapathi : భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’ షూటింగ్..

నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి కియారా అతిధిగా వెళ్లగా అక్కడి మీడియా విక్కీ కౌశల్, కత్రినా వివాహం గురించి అడిగారు. దీనికి కియారా సమాధానమిస్తూ.. ‘నిజంగానా? వాళ్ళ పెళ్లి గురించి వార్తలు విన్నాను, కానీ నాకేం తెలీదు. నన్నైతే వాళ్ళ పెళ్ళికి ఇప్పటివరకు ఆహ్వానించలేదు.’ అని తెలిపింది. అలాగే బాలీవుడ్ లో ఇప్పటికి కూడా ఇంకా ఎవరికీ వివాహ ఆహ్వానం అందలేదని సమాచారం. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం కత్రినా విక్కీల వివాహం జరగబోతున్నటు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పి మాట్లాడేంతవరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి.