Kichcha Sudeep: రాత్రిళ్లు నువ్వు నాకు కచ్చితంగా కనిపిస్తావు.. వీడ్కోలు మిత్రమా!

నటుడు పునీత్ రాజ్ కుమార్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉండగా.. తీవ్రశోకంలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Kichcha Sudeep: రాత్రిళ్లు నువ్వు నాకు కచ్చితంగా కనిపిస్తావు.. వీడ్కోలు మిత్రమా!

Sudeep

Kichcha Sudeep: నటుడు పునీత్ రాజ్ కుమార్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉండగా.. తీవ్రశోకంలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో తన మిత్రుడు పునీత్ గురించి మరో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇటువంటి సమయంలో పునీత్ కుటుంబానికి అండాగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం గత మూడు రోజులుగా పునీత్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సహకరించిన పోలీసు శాఖ, అధికారులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. పునీత్ మరణం ఇండస్ట్రీకి పెద్ద షాక్. పునీత్ లేని లోటు కచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటుంది.

ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి ప్రజలకు కొంత సమయం కావల్సిందే. మరో శకం ముగిసింది అనడానికి ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. పునీత్ అంత్యక్రియల సమయంలో అక్కడ కూర్చుని అంతా చూస్తూ ఉంటే, నాకు తెలియని బాధ, ఆలోచనల్లో కనిపిస్తుంది. వారి పిల్లలు, కుటుంబ సభ్యుల గురించే ఆలోచిస్తూ ఉన్నాను.

పునీత్ ఎప్పటికీ నేను ఇష్టపడే, ప్రేమించే వ్యక్తి, పునీత్ ఇక తన తల్లిదండ్రులతో కలిసి విశ్రాంతి తీసుకుంటాడు. నా మదిలో పునీత్ గురించి వచ్చిన ఆలోచన ఒక్కటే.. “పునీత్ రాయల్‌గా పుట్టాడు.. రాయల్‌గా బతిగాడు, రాయల్‌గా పెరిగాడు, రాయల్‌గానే ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు.”

మన స్టార్ ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయాడు. నేను రాత్రిళ్లు ఆకాశంలోకి చూసినప్పుడు.. నువ్వు నాకు కచ్చితంగా కనిపిస్తావు.. ఒక మెరుపులా మెరుస్తూ.. ప్రకాశవంతంగా అనిపిస్తావు.. ఇక వీడ్కోలు మిత్రమా..

సుదీప్, పునీత్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. 13ఏళ్ల తర్వాత తన ట్విట్టర్ డీపీ మార్చి పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులు అర్పించారంటేనే వారి స్నేహం ఎంత గట్టిదో అర్థం అవుతుంది.