Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..

అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎడారిలో మంట వేసి ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేసాడు ఓ గూండా. ఆ తరువాత ఆమెను వదిలేశాడు. కిడ్నాప్ చేసిన మరీ బలవంతంగా ఇంత చేసినవాడు ఆ తరువాత ఆమెను ఎందుకు వదిలేశాడు? పోలీసులకు ఫిర్యాదు చేయదనే ధైర్యమా? ఆ తరువాత ఆమె ఏం చేసింది?

Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..

Kidnapper saptapadi in desert

Kidnapper saptapadi in desert : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సినీ ఫక్కీలో ఓ ఘటన జరిగింది. ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. జూన్ 12న వివాహం చేయటానికి ఇరు వైపుల పెద్దలు ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ క్రమంలో ఆమెను కొంతమంది గూండాలు వచ్చి ఎత్తుకుపోయారు. వారిలో ఉపేంద్ర అనే వ్యక్తి ఆమెను ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంట వేసి ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేశాడు. ఆమె నన్ను వదులు అంటూ ఎంతగా ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అలా ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేసి..ఇక మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నువ్వు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అంటూ హెచ్చరించాడు.ఆ తరువాత ఆమెను వదిలేశాడు.

 

Viral Letter : నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి సార్, అమ్మాయి ఎలా ఉండాలంటే..: అధికారులకు లెటర్

దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూ మత సంప్రదాయంలో వివాహంలో అగ్నిహోత్రం చుట్టు వధువరులు ఏడు అడుగులు వేస్తారు. దీన్నే సప్తపది అంటారు.  అలా ఉపేంద్ర ఎడారిలో మంట వేసి ఆమెను ఎత్తుకుని ఆ మంట చుట్టూ ఏడు అడుగులు వేసి ఇక మనకు పెళ్లి అయిపోయింది. కాబట్టి నువ్వు ఎవ్వరిని వివాహం చేసుకోవటానికి వీల్లేదు అంటూ హెచ్చరించి వదిలేశాడు. వారి నుంచి తప్పించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

 

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందిస్తు..ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను కోరారు.