Kondapolam : ‘కొండపొలం’ మూవీపై మెగాస్టార్ మెగా రివ్యూ

చిరంజీవి మాట్లాడుతూ... వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి 'మామ..ఇలా క్రిష్‌గారి దర్శకత్వంలో 'కొండపొలం' అనే సినిమా చేస్తున్నాను' అనగానే నేను వెంటనే సినిమా చెయ్యి ఎందుకంటే క్రిష్

Kondapolam : ‘కొండపొలం’ మూవీపై మెగాస్టార్ మెగా రివ్యూ

Kondapolam

Kondapolam :  తన మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్. దీంతో మెగా ఫామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా హీరోగా మొదటి సినిమాతోనే నిలదొక్కుకున్నాడు. మొదటి సినిమా హిట్ అవ్వడంతో వరుస సినిమాలకి సైన్ చేశాడు. తాజాగా ఇవాళ వైష్ణవ రెండో సినిమా ‘కొండపొలం’ థియేటర్లలో విడుదల అయింది. రెండో చిత్రం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో చేయడం, అంతే కాక స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో కాంబినేషన్ చేయడం వైష్ణవ్ కి బాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు.

Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

‘కొండపొలం’ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. నిన్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ కి ఇండస్ట్రీ ప్రముఖులు, సినిమా టీం వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రీమియర్ కి వచ్చి సినిమా చూశారు. సినిమా అయిపోయిన తర్వాత మీడియాతో సినిమా గురించి రివ్యూ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ… అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించాడు. సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని తెలుసు, ఈ సినిమా చూసిన వారు ఖచ్చితంగా థ్రిల్‌కు గురవుతారని అన్నారు. నేనైతే కొండపొలం పుస్తకం చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామ..ఇలా క్రిష్‌గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే నేను వెంటనే సినిమా చెయ్యి ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది, మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది అని చెప్పానని అన్నారు.

Chay-Sam Breakup : వర్కౌట్ కానప్పుడు విడిపోవడమే బెటర్.. చై-సామ్ విడాకులపై స్పందించిన డైరెక్టర్

నేను చెప్పినట్టే సినిమాలో మంచి ఎమోషన్‌కు ఛాన్స్ ఉంది, వైష్ణవ్ తేజ్ నటన కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. క్రిష్‌ సినిమాలను నేను ముందు నుంచి చూస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి అని చిరంజీవి సినిమాపై మాట్లాడారు. ఆర్టిస్టులంతా బాగా చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను నమ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాతలకు, వైష్ణవ్, మిగిలిన టీం అందరికి ఆల్ ది బెస్ట్‌ అని చిరంజీవి అన్నారు.