NTR30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఈరోజు NTR30 అప్డేట్ రాబోతుంది..

టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ NTR30 గురించి నేడు అప్డేట్ రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా..

NTR30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఈరోజు NTR30 అప్డేట్ రాబోతుంది..

ntr30

టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ NTR30 గురించి నేడు అప్డేట్ రానుంది. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టలేదు. తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూనే ఉంది. పక్కా ప్రణాళికతో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనతో ఉండడంతో ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి సమయం పట్టింది.

Breath Movie : నందమూరి కుటుంబంలో మరో హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్..

ఇక గత నెలలోనే పూజ కార్యక్రమాలు జరుపుకోవాల్సి ఉండగా, తారకరత్న మరణం వలన అది కూడా వెనక్కి వెళ్ళింది. తాజాగా నేడు (మార్చి 6) ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నం అంటూ నిర్మాతలు తెలియజేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నేడు ఈ అమ్మడి పుట్టినరోజు కావడంతో, NTR30 లో జాన్వీ హీరోయిన్ అని ప్రకటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా వార్తలు వినిపిస్తుంది.

మరి ఈ అప్డేట్ జాన్వీ గురించా? లేదా సినిమా ఓపెనింగ్ అండ్ షూటింగ్ గురించా? తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్ గా ఉండండి ఏ సమయంలో అయినా అప్డేట్ రానుంది. కాగా ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ గా సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పని చేస్తుండగా.. అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ సాగనుంది.