NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కొరటాల..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా ప్రారంభించారు. ఈ సినిమా నుండి ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కొరటాల..?

Koratala Siva Planning Surprise From NTR30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా ప్రారంభించారు. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమాను కొరటాల అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథను చాలా పవర్‌ఫుల్‌గా రాసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

NTR30 : వరుస అప్డేట్‌లు ఇస్తున్న కొరటాల.. NTR30కి పని చేయబోతున్న సూపర్ మ్యాన్ మూవీ టెక్నీషియన్..

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో తారక్ పాత్రను విధ్వంసకరంగా చూపెట్టబోతున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో తారక్ సరికొత్త మేకోవర్‌లో కనిపించి అభిమానులను థ్రిల్ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమా నుండి ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నుండి త్వరలోనే ఓ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట.

NTR30: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందా.. అందుకేనా?

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ ఈ ప్రమోషనల్ వీడియోను తీసుకొస్తున్నాడట. గతంలోనూ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’, నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకు ప్రమోషనల్ వీడియోలు చేశాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. దీంతో ఇప్పుడు తారక్ సినిమా కోసం కూడా ఓ ప్రమోషనల్ వీడియోను చేసి అభిమానులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఏప్రిల్ 1 నుండి ఈ చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు తారక్ అండ్ టీమ్ సిద్ధమవుతున్నారు. మరి నిజంగానే ఈ సినిమా నుండి ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.