Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో థ్రిల్ లేదు.. ఈ సారి అమ్మాయిలు గెలుస్తారనుకున్నా.. కాని : కౌశల్

కౌశల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ 5 పెద్ద‌గా థ్రిల్ అనిపించ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగే వారే టాప్ 5కు చేరుతారు. గత 4 సీజన్స్ నుంచి అబ్బాయిలే గెలుస్తున్నారు. ఈ సారైనా అమ్మాయి

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో థ్రిల్ లేదు.. ఈ సారి అమ్మాయిలు గెలుస్తారనుకున్నా.. కాని : కౌశల్

Koushal

Bigg Boss 5 :  బిగ్ బాస్ 2 సమయంలో కౌశల్ అభిమానులు అంటూ కొంతమంది చేసిన హడావిడి ఎప్పటికి మర్చిపోలేరు.కౌశల్ ని విన్నర్ గా ప్రకటించపోతే అని బెదిరింపులు కూడా చేశారు. ఆ తర్వాత ఇవన్నీ కౌశల్ డబ్బులిచ్చి చేయించినట్లు ఆరోపణలు వచ్చి పెద్ద వివాదమే అయింది. ఇక కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ గా గెలిచాక అతను స్టార్ అయిపోతాడు అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ అతని కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ప్రస్తుతం కౌశ‌ల్ మండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ, తన పాత వృత్తి ఫోటో మోడలింగ్ సంస్థని కొనసాగిస్తున్నాడు. తాజాగా కౌశల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ సీజన్ 5 గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Chiranjeevi : చాలా గ్యాప్ తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్న మెగాస్టార్

కౌశల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ 5 పెద్ద‌గా థ్రిల్ అనిపించ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగే వారే టాప్ 5కు చేరుతారు. గత 4 సీజన్స్ నుంచి అబ్బాయిలే గెలుస్తున్నారు. ఈ సారైనా అమ్మాయిలు గెలుస్తార‌నుకున్నాను. కానీ షో చూస్తుంటే అమ్మాయిల‌కంత స్కోప్ లేదని తెలుస్తుంది. ఈ సారి కూడా అబ్బాయిలే ట్రోఫీ గెలుస్తారు అని చెప్పాడు.

Pushpa : వెయ్యి మంది డ్యాన్సర్లతో పుష్ప స్పెషల్ సాంగ్

బిగ్‌బాస్ షో తీరు చూస్తుంటే కౌశ‌ల్ చెప్పిందే నిజం అని అర్ధమవుతుంది. 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం 11 మందే మిగిలారు. 8 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, లోబో తప్ప స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, శ్వేత‌, హ‌మీదా, ప్రియ‌ ఇలా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హౌస్‌లో సిరి, కాజ‌ల్‌, ప్రియాంక సింగ్‌, యానీ మాస్టర్ ఉన్నారు. వీరిలో ప్రియాంక మాన‌స్ చుట్టూనే తిరుగుతుంది. గేమ్ ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇక కాజల్ ఉందో లేదో షోలో అన్నట్టు ఆడుతుంది. యానీ మాస్ట‌ర్ కాస్త పర్లేదనిపించినా ఆమె ఎప్పుడెలా ఉంటుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇక సిరి బాగానే ఆడుతుంది కానీ ష‌ణ్ముఖ్‌, జెస్సీల‌తో మాత్ర‌మే ఎక్కువ‌గా ఉంటుంది. వాళ్ళతో కలిసి ఆడుతుంది. వీళ్లల్లో ఏ ఒక్కరికి కూడా గెలిచే ఛాన్స్ కనపడటం లేదు. టాప్ 5లో కూడా ఉంటారో లేదో చూడాలి మరి. ఈసారి కూడా బిగ్‌బాస్ విజేత‌గా అమ్మాయిలని చూడాల‌నుకున్న వాళ్ళ క‌ల నెరవేరేలా లేదు.