Krithishetty : బేబమ్మ ఖాతాలో మరో సినిమా.. శర్వానంద్ 35లో కృతి..

తాజాగా కృతి శెట్టి మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం (మార్చ్ 6)న శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో శర్వానంద్ 35వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రకటించి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలిపారు చిత్రయూనిట్. కృతి ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ.................

Krithishetty : బేబమ్మ ఖాతాలో మరో సినిమా.. శర్వానంద్ 35లో కృతి..

Krithishetty acting in Sharwanand 35th movie

Krithishetty :  ఉప్పెనతో సినీపరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కన్నడ భామ కృతిశెట్టి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరాశ పరిచాయి. ఆ సినిమాల్లో కృతి అందంతో మెప్పించినా సినిమాలు ఆడలేదు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా కృతికి మాత్రం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కృతి చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

తాజాగా కృతి శెట్టి మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం (మార్చ్ 6)న శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో శర్వానంద్ 35వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రకటించి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలిపారు చిత్రయూనిట్. కృతి ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే శర్వా. ఇప్పటికి కొన్ని రోజులు మాత్రమే షూట్ చేశాం. కానీ సెట్ లో చాలా ఫన్ ఉంది. నీతో కలిసి షూట్ కోసం నెక్స్ట్ షెడ్యూల్ దాకా వెయిట్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది. గతంలో శర్వా సినిమాలో కృతి నటించబోతుందని వార్తలు వచ్చినా ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు కృతి పెట్టిన పోస్ట్ తో శర్వానంద్ 35వ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దీంతో కృతి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Sharwa35 : శర్వానంద్ 35 అనౌన్స్.. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో వెరైటీగా చెప్పారు..

ఇక శర్వానంద్ 35వ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుగుతుంది.