Nagarjuna : మీలాంటి వాళ్ళతో ఒక రోజంతా గడిపే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌యూ : బిగ్‌బాస్‌ లహరి

నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టిలను ఇంటర్వ్యూ చేసే అవకాశం లహరికి కల్పించాడు నాగార్జున. దీంతో ఈ బిగ్ బాస్ భామ తెగ ఆనందపడిపోయింది. నాగార్జున, చైతూలతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌.......

Nagarjuna : మీలాంటి వాళ్ళతో ఒక రోజంతా గడిపే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌యూ : బిగ్‌బాస్‌ లహరి

Lahari Shari

Bangarraju : గతంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు లహరికి. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పాల్గొని బాగా పాపులర్ అయి అభిమానులని కూడా సంపాదించుకుంది లహరి షారి. బిగ్‌బాస్‌ షోతో బాగా ఫాలోయింగ్‌ పెంచుకుంది ఈ భామ. బిగ్‌బాస్‌ కి హోస్ట్ గా చేసిన నాగార్జున లహరికి మంచి ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగార్జున తన ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో లహరికి అవకాశం కల్పించాడు.

 

‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ ప్రైవేట్‌ జెట్‌లో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. దీంట్లో నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టిలను ఇంటర్వ్యూ చేసే అవకాశం లహరికి కల్పించాడు నాగార్జున. దీంతో ఈ బిగ్ బాస్ భామ తెగ ఆనందపడిపోయింది. ఈ ఇంటర్వ్యూ బాగానే చేసింది లహరి. ఈ ప్రయివేట్ జెట్ లో నాగార్జున, చైతూలతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘కలలు నిజమవుతాయి. నా కల నెరవేరింది. మీలాంటి గొప్ప వ్యక్తులతో ఒక రోజంతా గడిపేందుకు అవకాశం ఇచ్చిన నాగార్జున సర్‌, చై సార్‌లకు ధన్యవాదాలు. లవ్‌ అక్కినేనిస్‌’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Shannu-Deepu : బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా బర్త్‌డే.. షన్ను స్పెషల్ పోస్ట్

అంతే కాక బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ కి కూడా బిగ్ బాస్ కాజల్ తో కలిసి యాంకర్ గా వ్యవహరించింది. ఈ ఆఫర్స్ నాగార్జునే ఇప్పించారని సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ తో బాగానే లాభపడుతుంది లహరి. త్వరలో నాగార్జున సినిమాల్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.