Leader : మళ్ళీ రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్.. ‘లీడర్ 2’ త్వరలో??

గతంలోనే 'లీడర్' సినిమాకి సీక్వెల్ ఉంటుందని శేఖర్ కమ్ముల తెలిపారు. తాజాగా మరోసారి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని రానా మాట్లాడాడు. ఇటీవల 'భీమ్లా నాయక్' సక్సెస్ మీట్ లో..........

Leader : మళ్ళీ రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్.. ‘లీడర్ 2’ త్వరలో??

Leader

 

Leader :  రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘లీడర్’. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. 2010లో వచ్చిన ‘లీడర్’ సినిమా మంచి విజయం సాధించి రానాని హీరోగా నిలబెట్టింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఒక మంచి క్లాసిక్ గా నిలిచింది. ఇది రానాకి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న హీరోలా నటించాడు. ఇందులో రానా నటనకి విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు.

అయితే గతంలోనే ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని శేఖర్ కమ్ముల తెలిపారు. తాజాగా మరోసారి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని రానా మాట్లాడాడు. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సక్సెస్ మీట్ లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో రానా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ‘లీడర్’ సీక్వెల్ గురించి మీడియా ప్రశ్నలు అడిగింది. వీటికి రానా సమాధానమిస్తూ.. ”శేఖర్ కమ్ముల నాకు లీడర్ సీక్వెల్ గురించి అప్పుడప్పుడు రెండు మూడు సీన్లు చెబుతుంటారు. మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ కొన్ని సీన్స్ చెప్తారు. లీడర్ 2 సినిమా మొత్తం శేఖర్ కమ్ముల చేతుల్లోనే ఉంది” అని అన్నారు.

Shanmukh Jaswanth : ఫేవరేట్ హీరోని కలిసిన ఆనందంలో షన్ను.. తనే వచ్చి షన్నుకి హాగ్ ఇచ్చిన సూర్య

దీంతో ఇప్పటికే ‘లీడర్’ సీక్వెల్‌కు సంబంధించి శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా అనౌన్స్ చేశారు. మరి ‘లీడర్ 2’ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి.