WhatsApp Status Video : మీకు వాట్సాప్ స్టేటస్ వీడియో నచ్చిందా.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే వాట్సాస్ తమ ప్లాట్ ఫాంపై స్టేటస్ ఫీచర్ (Status Feature) ఒకటి అందుబాటులోకి తెచ్చింది.

WhatsApp Status Video : మీకు వాట్సాప్ స్టేటస్ వీడియో నచ్చిందా.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

Liked Someone’s Whatsapp Status Video

WhatsApp status video Download : పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే వాట్సాస్ తమ ప్లాట్ ఫాంపై స్టేటస్ ఫీచర్ (Status Feature) ఒకటి అందుబాటులోకి తెచ్చింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ స్టోరీల మాదిరిగానే వాట్సాప్ లోనూ స్టేటస్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు నచ్చిన స్టేటస్ నుంచి ఫొటోలు, వీడియోలు, GIFలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్ సెక్షన్ లోకి వెళ్తే చాలు.. అక్కడ కెమెరా ఐకాన్ (Camera icon) కనిపిస్తుంది. ఇందులో మీరు ఫొటో తీయొచ్చు.. వీడియో షూట్ చేయొచ్చు.. గ్యాలరీ నుంచి మీడియా ఫైల్ అప్ లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అప్‌లోడ్ చేశాక send బటన్ పై క్లిక్ చేయండి.

మీకు వాట్సాప్‌లో నచ్చిన్ స్టేటస్ డౌన్ లోడ్ చేయాలంటే? ఎలా? అప్పుడు ఆ వాట్సాప్ యూజర్ ను పర్సనల్ గా చాట్ లో పంపమని అడగాల్సి ఉంటుంది. ఎవరిని అడగకుండా నేరుగా స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. ఒక స్టేటస్ ఫీచర్ ఉంది. ఫొటోలపై మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. వీడియోలపై పనిచేయదు. అయితే స్టేటస్ వీడియో కూడా ఎలా డౌన్ లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

1. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో Google Play Store నుంచి Google Files డౌన్ లోడ్ చేసుకోండి.
2. యాప్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో menu icon క్లిక్ చేయండి.
3. Settings ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. Show Hidden files ఆప్షన్ Turn On చేయండి.
5. మీ స్మార్ట్ ఫోన్ లో File Manager లోకి వెళ్లండి.
6. Internal Storage option> WhatsApp>Media>Statuses
7. Statuses ఫోల్డర్ ఓపెన్ చేయండి. అందులో మీరు చూసిన వాట్సాప్ ఫొటోలు, వీడియోలు ఉంటాయి.
8. మీకు నచ్చిన ఫొటో, వీడియోపై లాంగ్ ప్రెస్ చేయండి. Download చేసి మీకు నచ్చిన లొకేషన్ లో Save చేయండి.