Google: అదిరిపోయే కెమెరా ఫీచ‌ర్ల‌తో గూగుల్ ఫోన్లు

ఫోన్ అనగానే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూస్తున్న ఫీచర్ ఏందంటే కెమెరా.

Google: అదిరిపోయే కెమెరా ఫీచ‌ర్ల‌తో గూగుల్ ఫోన్లు

Pixel Phone

Google Pixel 6 and 6 Pro: ఫోన్ అనగానే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూస్తున్న ఫీచర్ ఏందంటే కెమెరా. బెస్ట్ కెమెరా ఆప్ష‌న్ ఉన్న ఫోన్ల‌నే ఇటీవల కాలంలో ఎక్కువగా కొంటూ ఉన్నారు. ఫోటోలు, వీడియోల కోసం స‌ప‌రేట్‌గా కెమెరా కొన‌కుండా ఎక్కువ మంది ఫోన్‌లోనే బెస్ట్ కెమెరా ఆప్ష‌న్ ఉన్నవాటిని ఎంచుకుని కొంటున్నారు.

ఈ క్రమంలో కంపెనీలు ఎక్కువగా కెమెరాకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. లేటెస్టుగా ఎక్కువ ఫిల్ట‌ర్స్ ఉండేలా త‌న స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను బెస్ట్‌గా తీసుకొస్తోంది గూగుల్. గూగుల్ త్వ‌ర‌లో లాంచ్ చేయ‌బోయే పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్ల‌లో అత్యాధునిక‌ కెమెరా ఆప్ష‌న్లు అందుబాటులోకి తెచ్చింది.

50 ఎంపీ రేర్ కెమెరాలో సామ్‌సంగ్ జీఎన్‌1 షూట‌ర్‌, 12 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌386 అల్ట్రా వైడ్ యాంగిల్ షూట‌ర్‌, 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌586 4ఎక్స్ జూమ్ టెలిఫోటో షూట‌ర్‌, ఫ్రంట్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, జూమ్ లేవ‌ల్స్ 0.7 ఎక్స్ 1.0ఎక్స్ లాంటి కెమెరా ఫీచ‌ర్లు ఉంటాయి.

పిక్సెల్ 6ప్రోలో మెయిన్ కెమెరాలో 60ఎఫ్‌పీఎస్‌లో 4కే వీడియో రికార్డింగ్ ఆప్ష‌న్ ఉంటుంది. 30ఎఫ్‌పీఎస్‌లో 4కే రికార్డింగ్‌, అల్ట్రా వైడ్‌, టెలిఫోటో ఆప్ష‌న్లు ఉంటాయి. ఈ ఫోన్లు ఆడియో జూమ్‌ను కూడా స‌పోర్ట్ చేస్తాయి. 20 టైమ్స్ జూమ్ చేస్తే 30 ఎఫ్‌పీఎస్‌లో 4కే రికార్డింగ్‌ స‌పోర్ట్ అందులో ఉంటుంది. 30ఎఫ్‌పీఎస్‌లో మాత్రం 1080 పిక్సెల్ రికార్డింగ్‌ స‌పోర్ట్ చేస్తుంది.

మ్యాజిక్ ఎరేజ‌ర్, ఫేస్ బ్ల‌ర్‌, సీన్ లాక్ వంటి ఫీచ‌ర్లు కూడా గూగుల్ కెమెరా యాప్‌లో ఉంటాయి. అలాగే.. మోష‌న్ బ్ల‌ర్‌, టైమ‌ర్ లైట్, బేబీ మోడ్‌, ఫ్రీక్వెన్సీ ఫేసెస్ వీ2, స్పాట్‌లైట్ ఫీచ‌ర్ లాంటి పీచ‌ర్లను కూడా గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అందించ‌నుంది