Ashu Reddy: అషూ చెప్పిన లవ్ కహానీ.. ఇద్దరూ రెండు కళ్ళట!

స్క్రీన్ బయట వాళ్ళు ఎలా ఉంటారో ఏమో కానీ.. ఇప్పుడు ఆన్ స్క్రీన్ జంటలు ఎక్కువైపోతున్నాయి. కామెడీ షోస్, యూట్యూబ్, రియాలిటీ షో.. ఇలా కాన్సప్ట్ ఏదైనా ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుందని సృష్టించడం.. ఆ తర్వాత వాళ్ళ చుట్టూ కాన్సెప్ట్స్ రాసుకొని ఎపిసోడ్లు నడిపించడం.. మధ్యలో పాటలు.. హార్ట్ సింబల్స్ వేసి వ్యూస్ రాబట్టుకోవడం మనం చూసున్నదే.

Ashu Reddy: అషూ చెప్పిన లవ్ కహానీ.. ఇద్దరూ రెండు కళ్ళట!

Ashu Reddy

Ashu Reddy: స్క్రీన్ బయట వాళ్ళు ఎలా ఉంటారో ఏమో కానీ.. ఇప్పుడు ఆన్ స్క్రీన్ జంటలు ఎక్కువైపోతున్నాయి. కామెడీ షోస్, యూట్యూబ్, రియాలిటీ షో.. ఇలా కాన్సప్ట్ ఏదైనా ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుందని సృష్టించడం.. ఆ తర్వాత వాళ్ళ చుట్టూ కాన్సెప్ట్స్ రాసుకొని ఎపిసోడ్లు నడిపించడం.. మధ్యలో పాటలు.. హార్ట్ సింబల్స్ వేసి వ్యూస్ రాబట్టుకోవడం మనం చూసున్నదే. ఈ జంటలకు కూడా బాగానే పారితోషకాలు గిట్టుబాటు అవుతుండడంతో పెళ్లి, శోభనాల సెటప్పుల వరకు వెళ్లి వినోదాన్ని పంచుతున్నారు.

అలా ఈ మధ్య వచ్చిన జంట అషూ రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి. ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ ఈ ఇద్దరు కలిసి స్కిట్స్ చేస్తున్నారు. ఊరికే స్కిట్స్ కాదు.. ఏకంగా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. ఈ మధ్యనే హరి గుండెల మీద అషు టాటూ కూడా వేసుకొని ప్రేక్షకులను కాసేపు కంగారు పెట్టేసి హడలెత్తించారు. ఇదొక్కటే కాదు.. ఈ మధ్య ఎక్కడ చూసినా హరి – అషు జంటగా కనిపిస్తుండగా అషు ఇంట్లో హరి హోమ్ టూర్ అంటూ వీడియోలు కూడా రూపొందిస్తున్నాడు.

కాగా.. అషు హరికి ముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షోతో మొదలైన ఈ ఇద్దరి బంధం స్నేహమా.. ప్రేమా అంటే ఏమో ఏదైనా కావచ్చని ఇన్నాళ్లు తప్పించుకుంటూ వస్తున్నారు. కాగా, ఇప్పుడు మధ్యలో హరి వచ్చాడు. అషునే తన లోకం అనేలా చుట్టూ తిరిగేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియా కూడా ఈ ముగ్గురిని కలిపి మీమ్స్, కామెంట్స్ తో గోల గోల చేసేస్తున్నారు.

ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అషునే అడిగేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అషూకు అభిమాని నుండి ఇదే ప్రశ్న ఎదురైంది. హరి-రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ నెటిజన్ అషును కోరగా.. ‘కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ’ అషూ ఫన్నీగా బదులిచ్చింది. అంతేకాదు ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్‌ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఇది అషూ చెప్పిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ రోయ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.