MacBook Air M2 : మ్యాక్‌బుక్ ఎయిర్ M2, ఎయిర్ ప్యాడ్స్ ప్రోలపై రూ. 10వేలు డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. డోంట్ మిస్..!

MacBook Air M2 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం Apple అనేక డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. లేటెస్ట్ సెట్‌లు iPhoneలు, ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు వంటి మరెన్నో ఉన్నాయి. Apple.in ద్వారా iPhone 14 ధర రూ. 72,900కి సేల్ అందుబాటులో ఉంది.

MacBook Air M2 : మ్యాక్‌బుక్ ఎయిర్ M2, ఎయిర్ ప్యాడ్స్ ప్రోలపై రూ. 10వేలు డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. డోంట్ మిస్..!

MacBook Air M2, AirPods Pro get up to Rs 10,000 discount offer, here is how the deals work

MacBook Air M2 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం Apple అనేక డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. లేటెస్ట్ సెట్‌లు iPhoneలు, ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు వంటి మరెన్నో ఉన్నాయి. Apple.in ద్వారా iPhone 14 ధర రూ. 72,900కి సేల్ అందుబాటులో ఉంది. MacBook Air M2, AirPods ప్రో డీల్స్ అందిస్తోంది. ఆపిల్ ప్రొడక్టులపై మాత్రం ఫ్లాట్ డిస్కౌంట్లను అందించడం లేదు. అన్ని డీల్‌లు బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా అదే డివైజ్‌లను షరతులు లేకుండా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

MacBook Air M2 డిస్కౌంట్ ఆఫర్‌ :
ఆపిల్ MacBook Air M2పై రూ. 10వేల తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. బ్యాంక్ కార్డ్‌పై కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం Apple.inలో (MacBook) రూ. 1,19,900 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ అసలు రిటైల్ ధర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగిన వినియోగదారులు మ్యాక్‌బుక్‌ను రూ. 1,09,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను చాలా తక్కువ ధరకు విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా MacBook Air M2ని రూ. 1,05,500 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో సరసమైన ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్‌తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.10వేల తగ్గింపు అందిస్తోంది. అంటే.. ఈ డివైజ్ ధర రూ.95,500కి తగ్గింపు పొందవచ్చు. కొత్త M2 ప్రాసెసర్‌తో Apple నుంచి వచ్చిన సరసమైన MacBook Air మోడల్ ఈ డీల్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. విజయ్ సేల్స్ ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్‌తో అందుబాటులో ఉంది. Mac ల్యాప్‌టాప్‌ను భారీ తగ్గింపు ఆఫర్‌తో అందిస్తోంది. ఈ డీల్ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండదని గమనించాలి.

MacBook Air M2, AirPods Pro get up to Rs 10,000 discount offer, here is how the deals work

MacBook Air M2, AirPods Pro get up to Rs 10,000 discount offer

AirPods ప్రో డీల్ ఆఫర్ :
సెకండ్ జనరేషన్ AirPods ప్రో మోడల్ Apple.in వెబ్‌సైట్ ద్వారా కూడా తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు Apple అధికారిక వెబ్‌సైట్‌లో రిటైల్ ధర రూ. 26,900 వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. ఈ ధరను రూ.24,900కి తగ్గించింది.

అదే ఆడియో ప్రొడక్టు ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)లో రూ. 24,990కి అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డులు లేకుంటే.. మీరు ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్ కార్డ్‌లపై కూడా కొన్ని అదనపు డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. AirPods Pro 2పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!