Madalsa Sharma: క్యాస్టింగ్ కౌచ్.. అమ్మాయి ఉందంటే చాలు చుట్టూ..

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ `కాస్టింగ్ కౌచ్` భాదితులున్నట్లు అప్పుడప్పుడు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో..

Madalsa Sharma: క్యాస్టింగ్ కౌచ్.. అమ్మాయి ఉందంటే చాలు చుట్టూ..

Madalsa Sharma

Madalsa Sharma: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ `కాస్టింగ్ కౌచ్` భాదితులున్నట్లు అప్పుడప్పుడు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ కావడం.. వారికి కొందరు మద్దతు ఇవ్వడంతో ఈ అంశం ఒక విప్లవంగా మారింది. దాదాపుగా అందరు నటీమణులు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమేనని ఒప్పుకోగా.. అందులో కొందరు బాధితులు వారికి జరిగిన అన్యాయాలను కూడా చెప్పుకొచ్చారు.

Amitabh Bachchan: సినిమాలే కాదు అద్దెల రూపంలో కూడా భారీ సంపాదన!

కాగా, ఇప్పుడు నటి మదాలస శర్మ కూడా ఈ అంశంపై స్పందించి క్యాస్టింగ్ కౌచ్ నిజమేనని కామెంట్ చేసింది. అల్లరి నరేష్ ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మదాలస తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించగా అనుకున్నస్థాయిలో పేరు రాకపోవడంతో ప్రస్తుతం హిందీలో అనుపమ సీరియల్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మదాలస ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలలోనే కాదు అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్ ఉందని పేర్కొంది.

Regina Cassandra: డస్కీ బ్యూటీ.. ఆస్వాదనకు రెండు కళ్ళూ చాలవేమో!

‘ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్లినా.. ఒక అమ్మాయి ఉందంటే చాలు ఆమె చుట్టూ పురుషులు కూడా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు ఆమె మీద ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే వారి ప్రవర్తనను బట్టి ఎలా మసలుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది.’ ‘కొందరు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రభావితం కావడం, కాకపోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది. దాన్ని వేరెవరూ మార్చలేరు. నాకైతే ఎవరైనా ఉన్నప్పుడు సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాను. అప్పుడు నన్నెవరూ ఆపరు కదా! నేను ఒక నటిని, నా ప్రతిభను చాటుకునేందుకు ఇక్కడిదాకా వచ్చాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా నాకుంది’ అని మదాలస చెప్పుకొచ్చింది.