NTR-RamCharan : ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్నేహం చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది

'నాటు నాటు..' పాటలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను చూసి తనకు అసూయ కలిగిందంటూ ప్రముఖ నటుడు మాధవన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నాటు నాటు పాటని షేర్ చేస్తూ.. ''ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు..

NTR-RamCharan : ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్నేహం చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది

Ntr Ramcharan

NTR-RamCharan :   రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాబోతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఎంత బాగా నటించారో ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక పాటల్లో, డ్యాన్సుల్లో కూడా ఇద్దరూ అద్భుతంగా సింక్ అయ్యారు. ‘నాటు నాటు…’ సాంగ్ లో వీరిద్దరూ కలిసి చేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో మన అందరికి తెలిసిందే. ఇక బయట కూడా వీళ్ళు చాలా మంచి స్నేహితులు. తాజాగా వీళ్లిద్దరి స్నేహంపై మరో హీరో వ్యాఖ్యలు చేశారు.

Radheshyam : ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా.. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేనట్టే

‘నాటు నాటు..’ పాటలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను చూసి తనకు అసూయ కలిగిందంటూ ప్రముఖ నటుడు మాధవన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నాటు నాటు పాటని షేర్ చేస్తూ.. ”ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇందులో వారిద్దరి స్నేహం, సమన్వయం నాలో అసూయ పుట్టిస్తున్నాయి.” అంటూ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. టాలీవుడ్ తో పాటు అన్ని సినీ పరిశ్రమలు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కాని కరోనా వల్ల సినిమా మళ్ళీ వాయిదా పడింది.