Non Veg Goat : చికెన్, మటన్ తినే మేక..ఆకులవైపు కన్నెత్తి కూడా చూడదట..

రఫిక్ అనే రైతు పెంచుకునే మేక ‘చికెన్, మటన్ లు తెగ లాగించేస్తోంది. అందుకే ఈ మేకను నాన్ వెజ్ మేక.

Non Veg Goat : చికెన్, మటన్ తినే మేక..ఆకులవైపు కన్నెత్తి కూడా చూడదట..

12 (1)

Non Veg Goat : ‘‘ఆకులు తింటది మేక..మేకను తింటిది పులి..దాక్కో దాక్కో మేక..పులి వచ్చి కొరుకుద్ది పీక’’ పుష్ప సినిమాలో ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనక్కరలేుద. ఈ మాట ఎందుకంటే..మేక‌లు ఆకులు తింటాయని చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు. కానీ ఓ మేక మాత్రం వెరి వెరీ డిఫరెంట్. ఆకులు తినాల్సిన మేక ‘చికెన్, మటన్ లు తెగ లాగించేస్తోంది. ఈ మేకకు ముక్క లేనిదే ముద్ద దిగదట..! వినటానికి ఇది విచిత్రంగా ఉన్నా ఈ మేక టేస్టే వేరంటోంది…అందుకే దీన్ని నాన్ వెజ్ మేక అంటారు. గతంలో ఓ మేక పచ్చి చేపల్ని పరపరా నమిలేసి తినేటం గురించి విన్నాం. కానీ ఈ మేక మాత్రం చికెన్, మటన్ అంటే ఫుల్ గా పొట్టపగిలేలా గాలించేస్తుందట..

Read more : Goat Eating Fish : పచ్చి చేపల్ని..పచ్చిగడ్డిలా తినేస్తున్న మేక..

ఆ నాన్ వెజ్ మేక పేరు ‘భురి’. మధ్యప్రదేశ్ లోని లోహరి అనే గ్రామంలో రఫిక్ అనే రైతు పెంచుకుంటున్నాడు భురిని. ఆకులు తినాల్సిన ఈ మేక‌కు ఎలా నాన్ వెజ్ అల‌వాటు అయిందనే డౌట్ వస్తుంది. కానీ భురికి నాన్ వెజ్ తినటం చిన్నప్పటినుంచి అలవాటు అయ్యిదట. చికెన్, మటనే కాదు చికెన్ బిర్యానీ దిని ముందు పెడితే ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తుందట..

దీంతో రఫిక్ దానికి ప్ర‌తి రోజు చికెన్ బిర్యానీ తెచ్చి పెడుతున్నాడు. ఆ చుట్టుపక్క ఏవైనా ఫంక్ష‌న్లు అయిన‌ప్పుడు మ‌ట‌న్, చేప‌లు పెడుతుంటామని చెప్పాడు రఫిక్. మా నాన్ వెజ్ మేక చికెన్, మటన్ తో పాటు గుడ్లు కూడా చక్కగా తింటుందని మురిపెంగా చెప్పాడు. మూడేళ్ల నుంచి మా భురి నాన్ వెజ్ తిన‌డం అల‌వాటు చేసుకుందని..ప్రతి రోజూ చికెన్ బిర్యానీ ఉండాల్సిందేనంటున్నాడు రఫిక్. బిర్యానీ పెట్టకపోయినా..ఆరోజు పచ్చి ఆకులు మాత్రం ముట్టదని..పచ్చిన మొక్క‌ల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌దటంటు భురి యజమాని ర‌ఫిక్ చెప్పుకొచ్చాడు భురి నాన్ వెజ్ భారతాన్ని.