Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ అండ్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

ఇక ప్రమోషన్స్ జోరు పెంచిన ఈ సినిమా యూనిట్, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ సహా, మహేష్ బాబు, కీర్తి సురేష్.. ఇలా అందరూ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సర్కారు వారి పాట టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్ కాదని.. లీకు రాయుళ్ల వల్లే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో బన్నీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఒకరోజు తాను జిమ్‌లో ఉండగా, సర్కారు వారి పాట టైటిల్ లీక్ గురించి తెలుసుకున్నాడట. దీంతో డైరెక్టర్‌కు ఫోన్ చేసి ఇదే విషయంపై ఆరా తీయగా, ఈ టైటిల్ కథకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని తాను కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పడంతో, వెంటనే మహేష్ ఈ టైటిల్‌ను ఓకే చేశాడట. ఇలా సర్కారు వారి పాట టైటిల్ కార్డ్ పడటానికి లీకు రాయుళ్లే కారణమని చెప్పుకొచ్చాడు మహేష్. ఇక ఈ సినిమాను పూర్తిగా ప్రేక్షకులు మెచ్చే విధంగా తాము తీర్చిదిద్దామని చిత్ర ప్రమోషన్స్‌లో మహేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలో నదియా, సముథ్రకని, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.