Mahesh – Rajamouli Film : జూన్‌లో షూటింగ్.. రాజమౌళి-మహేష్ సినిమాపై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

ఇప్పటికే మహేష్ తో తీయబోయే సినిమా గ్లోబల్ అడ్వెంచర్ అని, విదేశాల్లో, అడవుల్లో జరిగే కథ అని, ఇండియానా జోన్స్ లాగా సాహసయాత్ర సినిమా అని చెప్పారు రాజమౌళి. దీంతో మహేష్ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు................

Mahesh – Rajamouli Film : జూన్‌లో షూటింగ్.. రాజమౌళి-మహేష్ సినిమాపై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

Mahesh babu and Rajamouli Film shoot starts in 2023 june

Mahesh – Rajamouli Film : RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక రాజమౌళి హాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ మహేష్ సినిమా గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ హింట్స్ ఇస్తుంటే అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

ఇప్పటికే మహేష్ తో తీయబోయే సినిమా గ్లోబల్ అడ్వెంచర్ అని, విదేశాల్లో, అడవుల్లో జరిగే కథ అని, ఇండియానా జోన్స్ లాగా సాహసయాత్ర సినిమా అని చెప్పారు రాజమౌళి. దీంతో మహేష్ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. రాజమౌళి సినిమాలకి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ కథలు రాస్తారని తెలిసిందే. ఈ సినిమాకి కూడా విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు.

Suriya : డైరెక్టర్ బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య.. ఆగిపోయిన సినిమా.. పాపం కృతిశెట్టి..

తాజాగా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాపై మాట్లాడుతూ.. ”మహేష్ బాబు మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తాడు. రాజమౌళి ఎప్పట్నుంచో ఇలా అడవుల్లో సాగే సాహసయాత్ర లాంటి కథని తీయాలని అనుకుంటున్నాడు. ఈ కథకి మహేష్ సరిగ్గా సరిపోతాడు. అందుకే రాజమౌళి మహేష్ తో సినిమా తీయడానికి ఫిక్స్ అయ్యాడు. నేను మహేష్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ 2023 మే లేదా జూన్ నుంచి ఉండొచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమాని షూట్ చేయబోతున్నారని” తెలిపారు విజయేంద్రప్రసాద్. దీంతో సినిమాకి మరింత హైప్ చేకూరింది.