Mahesh Babu: దర్శకుడికి మహేష్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట అతనో ఫ్యామిలీ హీరో అని. సినిమాలు, షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతోనే షికార్లు చేసే మహేష్ సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో..

Mahesh Babu: దర్శకుడికి మహేష్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట అతనో ఫ్యామిలీ హీరో అని. సినిమాలు, షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతోనే షికార్లు చేసే మహేష్ సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్లు కూడా వేస్తుంటాడు. అలానే ఒకసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉండగా ముంబైలోని ఓ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారట. పక్కనే దర్శకుడు మెహర్ రమేష్ ఫ్యామిలీ కూడా ఉంది. మెహర్ రమేష్ కుటుంబంతో మహేష్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

అలా.. హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా.. మహేష్ వద్దకు ఇద్దరి అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగారట. పక్కన ఫ్యామిలీ ఉంది సరైన సమయం కాదని ఆ అమ్మాయిల రిక్వెస్ట్ కి సున్నితంగా మహేష్ రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ అమ్మాయిలు ఇద్దరూ అక్కడ నుండి వెళ్లిపోయారట. తీరా వాళ్ళు వెళ్లిన తర్వాత మెహర్ రమేష్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడట. ఆ అమ్మాయిలు ఇద్దరూ దర్శకుడు శంకర్ కుమార్తెలని చెప్పాడట.

Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి

దీంతో ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని మహేష్ మెహర్ రమేష్ కు చీవాట్లు పెట్టాడట. అంతేకాదు.. ఆ తర్వాత శంకర్ ఫ్యామిలీ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడకి వెళ్లి శంకర్ కు క్షమాపణలు చెప్పాడట. దానికి శంకర్ కూడా పర్వాలేదు హీరోలు ఎలా ఉండాలో వాళ్ళకి తెలిసేలా చేశారని చెప్పాడట. మహేష్ వెళ్లి కలిసి క్షమాపణలు చెప్పడం సంస్కరమైతే.. మహేష్ సెల్ఫీ ఇవ్వలేనని చెప్పినా మేము శంకర్ కుమార్తెలం అని చెప్పడకుండా అర్ధం చేసుకొని అక్కడ నుండి వెళ్లిన శంకర్ కుమార్తెలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.