SSMB28 : సంక్రాంతే కాదు.. దసరాకి కూడా పోటీయే!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్ వచ్చిందంటే హీరోలు తమ సినిమాలతో పోటీపడేందుకు రెడీ అవుతారు. ఇటీవల సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో బరిలోకి దిగారు. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో సంక్రాంతి సీజన్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది.

SSMB28 : సంక్రాంతే కాదు.. దసరాకి కూడా పోటీయే!

SSMB28 To Clash With Hari Hara Veera Mallu

SSMB28: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్ వచ్చిందంటే హీరోలు తమ సినిమాలతో పోటీపడేందుకు రెడీ అవుతారు. ఇటీవల సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో బరిలోకి దిగారు. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో సంక్రాంతి సీజన్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది.

SSMB28 : డైరెక్షన్ చేయకుండా క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరల్ వీడియో!

దీంతో మళ్లీ ఏ పండగకు టాలీవుడ్‌లో సినిమాలు పోటీ పడుతాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దసరా పండగకు మరోసారి బాక్సాఫీస్ వార్ జరగనుందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 మూవీలు దసరా బరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయట. ఈ సినిమాల్లో పవన్ మూవీ ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, మహేష్ మూవీ మాత్రం ఇటీవల షూటింగ్ జరుపుకుంటోంది.

Hari Hara Veera Mallu: వీరమల్లు టీజర్ కోసం ఆతృతగా చూస్తున్న ఫ్యాన్స్!

పవన్ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ కథగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా, SSMB28 మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ హీరో విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లియో’ మూవీ కూడా దసరా సీజన్‌కే రిలీజ్ కానుంది. దీంతో సంక్రాంతి మాదిరిగా, దసరాకు కూడా రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ సినిమా పోటీకి దిగుతున్నాయి. మరి దసరా బరిలో ఎవరు గెలుస్తారో అనేది సినిమాల రిలీజ్ తరువాతే తెలుస్తోంది.