SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!

SSMB28 షూటింగ్ సెట్స్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్ అయ్యింది. ఆ పిక్ లో మహేష్ చెక్స్ షర్ట్ లో, పూజా లంగా ఓణిలో కనిపిస్తూ..

SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!

Mahesh Babu Pooja Hegde photo leak from SSMB28 sets

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB28 లో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో మహేష్ సరసన పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి షూటింగ్ సెట్స్ నుండి ఏదో రకంగా ఫోటోలు, వీడియోలు బయటకి లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఒక షాపింగ్ మాల్ లో జరుగుతుంది. మహేష్, పూజా పై ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్.

SSMB28: మే 31న ఇచ్చిపడేద్దాం అంటోన్న థమన్.. మహేష్ మూవీ అప్డేట్‌పై మరింత క్రేజ్!

ఇక ఆ చిత్రీకరణని ఒక అభిమాని ఫోటో తీసి నెట్టింట పెట్టగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటోలో త్రివిక్రమ్, పూజాకి సీన్ వివరిస్తుండగా మహేష్ బాబు పక్కన నిలబడి కనిపిస్తున్నాడు. ఇక ఈ పిక్ లో మహేష్ చెక్స్ షర్ట్ లో, పూజా లంగా ఓణిలో కనిపిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. మహేష్ బీడీ కలుస్తూ రఫ్ లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోస్టర్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగి పోయాయి.

ఆగష్టు నెలలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ లేట్ కావడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తుంది. గతంలో నాని సినిమాలో కాసేపు డ్యూయల్ రోల్ చేసి అలరించిన మహేష్ ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ జోలికి వెళ్ళలేదు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే మాత్రం మహేష్ అభిమానులకు పండగ అనే చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.