Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా..

Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ నుండి టీజర్లు, పాటలు ఈ సినిమాలోని పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి.

Sarkaru Vaari Paata: ఇయర్‌ఫోన్స్, సబ్‌వూఫర్స్ పేలిపోతాయని హెచ్చరిస్తున్న థమన్

సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచేసిన ఎస్వీపీ టీం ఈరోజు సాయంత్రం 04.05 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేసింది. అయితే.. అంతకు ముందే ట్రైలర్ షాట్స్ పేరుతో మరో వీడియోను కూడా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ ట్రైలర్ అంటూ మేకర్స్ ముందు నుండి చెప్పినట్లుగానే మహేష్ ట్రైలర్ తోనే దుమ్ములేపేశాడు. ట్రైలర్ ఈ సినిమా అంచనాలను భారీ పెంచేసిందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

Sarkaru Vaari Paata : ఇలాంటి కథ ఇప్పట్లో రాదు.. సర్కారు వారి పాట సినిమాపై అనంత శ్రీరామ్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 105 షాట్స్ కాంబినేష‌న్‌లో ‘సర్కారు వారి పాట’ ట్రైల‌ర్ అంద‌రినీ అల‌రిస్తుంది. ఒక వైపు మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక సినిమా మ‌హేష్ లుక్ గురించి ప్ర‌ధానంగా చెప్పుకోవాలి. నాలుగు ప‌దులు వ‌య‌సు దాటినా కూడా కుర్ర హీరోల క‌నిపిస్తున్న మహేష్.. కీర్తితో కెమిస్ట్రీ, డైలాగ్స్ కూడా మెప్పిస్తున్నాయి. అలాగే మాస్‌ను మెప్పించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మోత మోగిపోయింది. సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక కీర్తి సురేష్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది.