SSMB28 : SSMB28 న్యూ షెడ్యూల్ అప్డేట్..

మహేష్ బాబు తాజా చిత్రం SSMB28 గురించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్ లో వినిపిస్తుంది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గురించి..

SSMB28 : SSMB28 న్యూ షెడ్యూల్ అప్డేట్..

SSMB28

SSMB28 : మహేష్ బాబు తాజా చిత్రం SSMB28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు మంచి ప్రజాధారణ పొందాయి. ప్రెజెంట్ వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ మూవీ పై మరింత హైప్ ని క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా గురించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్ లో వినిపిస్తుంది.

SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

ఇటీవల ఈ సినిమాలో టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ మహేష్ బాబుకి తల్లిగా నటిస్తుంది అంటూ గట్టిగా వార్తలు వినిపించాయి. దీని గురించి మాత్రం మూవీ టీం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కొత్త షెడ్యూల్ గురించి న్యూస్ బయటకి వచ్చింది. రేపటి (ఫిబ్రవరి 27) నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక ఖరీదైన ఇంటి సెట్లో జరగనుందట. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్ లు పూజ హెగ్డే, శ్రీలీల కూడా పాల్గొనున్నారు.

ఈ మూవీలో జగపతిబాబు విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. కాగా అతడు సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, కామెడీ యాక్షన్ ఫిలింగా తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఈ చిత్రాన్ని ఎలా తీయబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.